విజ్ఞాలు తొలగించే వినాయకుడి కథల నుంచి మనం జీవితపాఠాలు నేర్చుకోవచ్చు. పార్వతి స్నానానికి వెళ్తూ గణేశుడ్ని కాపలాగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ప్రాణం పోయినా విధి నిర్వహణలో తగ్గకూడదనే సందేశం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. గణపతి తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి వారిచుట్టూ చేసిన ప్రదక్షిణల ద్వారా దేవుడికైనా తల్లిదండ్రులను మించిన లోకం లేదనే సందేశాన్ని అందించాడు. పెద్దమనసు కలిగిన గణపతి చంద్రుడిని క్షమించిన విషయం తెలుసు కదా. కోపం కంటే క్షమ గొప్పదని ఈ కథ ద్వారా గణపతి జీవిత పాఠాన్ని చెబుతున్నాడు. భారతం రాసేందుకు తనకు వ్రాయస కారుడిగా వ్యవహరించాల్సిందిగా గణేశుడిని అభ్యర్థించాడు. అందుకు ఒకటే షరతు విరామం లేకుండా వ్యాసుడు శ్లోకాలు పఠించాలి. గణపతి రాస్తుండగా మధ్యలో పాళీ విరిగిపోయిన సందర్భంలో తన దంతాలలో ఒకదాన్ని విరిచి ఉపయోగించాడట. అలా గణపతి ఏకదంతుడయ్యాడు. గణేశుడు విరామం లేకుండా రాయాలి. ఇలా ఒకబృహత్కార్యం మొదలైంది. వ్యాసుడు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు, గణపతి రాస్తున్నాడు. తనకు తాను విధించుకున్న షరతును ఏ పరిస్థితుల్లోనూ అధిగమించకూడదనే జీవిత పాఠాన్ని ఈ గణపతి కథ మనకు తెలియజేస్తుంది.