అగ్ని పురాణం ప్రకారం అన్ని దీపాల్లోకెల్లా పవిత్రమైనది ఇదే
మన సంప్రాదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలిగించడం అంటే చీకటిని పారద్రోలేది అని అర్థం
నిత్యం ఇంట్లో దీపం వెలుగుతుండడం కూడా ఎలాంటి చెడు కుటుంబసభ్యుల దరిచేరకుండా కాపాడుతుందని నమ్ముతారు
అజ్ఞానాంధకారంలో నుంచి జ్ఞానపు వెలుగులను ప్రసరింపజేయడానికి గుర్తుగా దీపాన్ని వెలిగిస్తారు.
దీపపు కాంతి నుంచి వెలువడే కాంతి పుట్టించే వేడి పరిసరాల్లో ఒక సమతుల్యతను తెస్తుంది.
అగ్ని పురాణం ప్రకారం నేతితో వెలిగించిన దీపం అన్ని దీపాల్లోకి పవిత్రమైందిగా చెప్పవచ్చు
నేతి దీపాలు వాటి చుట్టూ ఆవరించి ఉండే పరిసరాల్లో సాత్విక ప్రకంపనలు వ్యాపింప చేస్తాయి
నేతిదీపం వెలగడం ఆగిపోయిన తర్వాత కూడా ఈ సాత్వికత ఎన్నో గంటల పాటు ఆ పరిసరాల్లో ఉంటుంది.
దీపపు వెలుగు ఇంట్లో కీటక నాశనిగా పనిచేస్తుంది. సూక్ష్మజీవులను కూడా నశింపజేస్తుందని నమ్ముతారు
నేతి దీపం నుంచి వెలువడే సువాసన కూడా పరిసరాలలోని దుర్వాసనను పారద్రోలి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది
Image Source: Pexels
నేతి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సకారాత్మక శక్తులకు ఆహ్వానం పలుకుతూ, దుష్టశక్తులను దూరంగా తరిమేసే చర్యగా చెప్పుకోవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే