అంతా మట్టేగా.. అర్థమవుతోందా!
మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||
మృత్తికయే పరబ్రహ్మం అంటారు..అంటే ప్రకృతి మొత్తం మృత్తికా స్వరూపమే
సకల జీవుల పుట్టుకకు మూలకారణం మట్టే
సకల జీవులకు పోషణ అందించేది ఆ మట్టే..
సకల జీవులు చివరకు కలిసేది మట్టిలోనే
ఇదే పరబ్రహ్మతత్వం..ఈ సత్యాన్ని చాటిచెప్పేందుకే పరమేశ్వరుడు మట్టితో గణనాథుడిని తయారు చేశాడు( లింగపురాణం ప్రకారం)
పేదా గొప్పా అనే బేధం లేకుండా అందరీ అందుబాటులో ఉంటాడు మృత్తికా గణేషుడు
సర్వ సమానత్వానికి ప్రతీక భూమి/మట్టి..అందుకే మట్టి గణపతే మహాగణపతి
గణేష్ చతుర్థి రోజు కేవలం మట్టి గణపతినే పూజించాలని చెబుతున్నాయి పురాణాలు