Ganesh Chaturthi 2024: సింగపూర్ లో సంపెగ, నేపాల్ లో తంత్ర, శ్రీలంకలో పిళ్లయార్..విదేశాల్లో మన గణపయ్య!
Vinayaka Chavithi 2024: వినాయక చవితి అంటే చిన్నా పెద్దా అందరకీ సంబరమే. ఆలయాల్లో, మండపాల్లో, ఇళ్లలో గణేషుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే విదేశాల్లోనూ గణనాథుడికి విశిష్టమైన ఆలయాలున్నాయి తెలుసా
Ganesh Chaturthi 2024: ముంబై సిద్ధివినాయక ఆలయం, మహారాష్ట్రలో అష్టవినాయక ఆలయాలు, కాణిపాకం గణపయ్య..ఇలా మన దేశంలో వినాయకుడికి ప్రత్యేకమైన ఆలయాలు చాలా ఉన్నాయి. కేవలం భారతదేశంలో మాత్రమేకాదు విదేశాల్లోనూ గణేషుడికి అద్భుతమైన దేవాలయాలున్నాయి.
నేపాల్
నేపాల్ భక్తపూర్ జిల్లాలో ఉన్న సూర్య వినాయక ఆలయం భక్తులు సందర్శించాల్సిన ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ఖాట్మండు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి అడవిమార్గంలో నడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమీపంలో ఉన్న మరో ఆలయం తంత్ర గణపతి. ఇక్కడ వినాయకవిగ్రహం కళ్లు ఏటవాలుగా ఉంటాయి. అక్కడ ప్రకృతి ప్రేమికులు ఈ వినాయకుడిని పంటల దేవుడిగా భావిస్తారు. ఇక్కడి వారు తాంత్రిక ఉపాసనలో భాగంగా విఘ్ననాథుడిని పూజిస్తారు.
Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
మలేషియా
మలేషియాలో పార్వతీతనయుడికి ఉన్న అతి పెద్ద ఆలయం శ్రీ సితి వినాయక్. ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం సెలంగోర్‌లోని పెటాలింగ్ జయలో జలాన్ సెలంగోర్ సమీపంలో ఉంది.
శ్రీలంక
శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి..వాటిలో ఒకటి పిళ్లయార్ ఆలయం. దీనికి సమీపంలోనే అరియాలై సిద్ధివినాయకర్ , కటరగామలో మరో గణేశ దేవాలయం ఉన్నాయి
ఐర్లాండ్
బెర్లిన్ కు చెందిన విక్టర్ లాంగ్ హెల్డ్ అనే వ్యక్తి దేశవిదేశాల్లో ఆలయాల్లో పర్యటించి గణేషుడి భక్తుడిగా మారాడు. ఆ భక్తితోనే ఐర్లాండ్ కౌంటీ విక్లో సమీపంలో గ్రానైట్ శిలను చెక్కించి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశాడు. తమిళనాడుకి చెందిన భారతీయ శిల్పకారులు చెక్కిన ఈ విగ్రహాలు ఒక్కోటి దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుంది.
మయన్మార్
మనకు బ్రహ్మ అంటే త్రిమూర్తులలో ఒకరు...కానీ మయన్మార్ వాసులకు వినాయకుడే బ్రహ్మ. బ్రహ్మదేవుడే వినాయకుడిదా మారాడని విశ్వసిస్తారు. ఇక్కడ వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
థాయిలాండ్
థాయ్ లాండ్ లో వినాయక ఆలయాలు చాలా ఉన్నాయి..వాటిలో ఒకటి హువాయ్ క్వాంగ్ స్క్వేర్. నిత్యం ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. చియాంగ్ లో సిల్వర్ టెంపుల్ బయటే వెండి వినాయక విగ్రహం దర్శనమిస్తుంది.
Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!
నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ డెన్ హెల్డర్ లో ఉన్న శ్రీ వరతరాజ సెల్వవినాయక దేవాలయం అత్యంత విశిష్టమైనది. 1991 లో శ్రీలంక నుంచి వెళ్లిన తమిళులు దీన్ని నిర్మించారు.
ఇండోనేషియా
ఇండోనేషియా బాలిదీవిలో వినాయకుడి ఆలయాలున్నాయి. ఇక్కడ స్కూల్స్, ప్రముఖ నిర్మాణ సంస్థల్లోనూ గణపయ్య విగ్రహాలు ప్రతిష్టిస్తుంటారు. అంతెందుకు ఇండోనేషియా కరెన్సీపై కూడా వినాయకుడి బొమ్మ చూడొచ్చు. ఇంకా సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ పార్వతీ తనయుడికి ఆలయాలున్నాయి. మనదేశంలో లానే...ఇండోనేషియాలోనూ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
అమెరికా
అమెరికా న్యూయార్క్‌లో మొదటి హిందూ దేవాలయం ‘శ్రీ మహావల్లభ గణపతి ఆలయం’. స్థానికులు ఈ ఆలయాన్ని ఫ్లషింగ్ టెంపుల్ అంటారు. అమెరికాలో చాలా ప్రదేశాల్లో వినాయక ఆలయాలున్నాయి
సింగపూర్
సిలాన్ రోడ్డు లో చోళరాజులు నిర్మించిన ఆలయం శ్రీ సెంపగ వినాయకగర్...ఈ ఆలయానికి 160 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
Also Read: గణపతిని 21 ఆకులతోనే ఎందుకు పూజించాలి..ఆ పత్రి ఏంటో తెలుసా!