అన్వేషించండి

Ganesh Chaturthi 2024: గణపతిని 21 ఆకులతోనే ఎందుకు పూజించాలి..ఆ పత్రి ఏంటో తెలుసా!

Ganesh Chaturthi 2024: ఆటంకాలు తొలగించి శుభాన్ని కలిగించాలంటూ వినాయకుడిని పూజిస్తారు. పూజా సామగ్రిలో ప్రధానమైనది పత్రి..అది కూడా 21 రకాల ఆకులు వినియోగిస్తారు..ఎందుకు..

Medicinal Benefits of 21 Leaves Used for Lord Ganesha Puja: గణేష్ చతుర్థి అనగానే చక్కటి విగ్రహం తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టించి పూజిస్తారు. ధూప దీప నైవేద్యాలతో పాటూ ఏకవింశతి పత్రి పూజ చేస్తారు. ఏకవింశతి అంటే 21 రకాల ఆకులతో లంబోదరుడిని పూజిస్తారు. సాధారణంగా ఏ దేవుడికైనా పూలు,అక్షతలతో పూజ చేస్తారు..కానీ చవితి పూజలో మాత్రం పూలున్నా లేకున్నా పత్రి తప్పనిసరి. 

ఏ దేవుడికి చేయని పత్రి పూజ వినాయకుడికే ఎందుకు..దాని వెనుకున్న పరమార్థం ఏంటంటే..పత్రి పూజకు వినియోగించే ఆకులన్నీ అద్భుతమైన ఔషధ గుణాలున్నవే. అందుకే వ్రతకల్పంలో ఏ ఆకులు చెప్పారో వాటిని మాత్రమే పూజించాలి.. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలసి బ్యాక్టీరియాను తరిమికొడతాయి. పైగా..తొమ్మిదిరోజుల పాటూ పూజలో వినియోగించే ఆకులన్నీ నదుల్లో, చెరువుల్లో కలవడం వల్ల నీటిలో ఉండే కాలుష్యం కూడా తగ్గుతుంది. 

Also Read: వినాయకచవితి సహా భాద్రపదమాసం (సెప్టెంబర్) లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే!

ఇంతకీ ఏ పత్రిని వినియోగించాలి - వీటి వాసన తగిలితే ఎన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయో ఇక్కడ తెలుసుకోండి...

మాచీపత్రం - ఈ పత్రి వాసన తలనొప్పి, కంటిదోషాలను నివారిస్తుంది 
 
బృహతీపత్రం - ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది
 
బిల్వపత్రం - చర్మదోషాలను నివారిస్తుంది

దూర్వాపత్రి - మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది 
 
దత్తూరపత్రం - కీళ్లనొప్పులకు అద్భుతమైన ఔషధం.. ఈ ఆకురసాన్ని తేలు, జెర్రి కాటుకి కూడా వినియోగిస్తారు

బదరీ పత్రం - అజీర్తిని తగ్గిస్తుంది..రక్తంలో ఉండేదోషాలను నివారిస్తుంది...వీర్యాన్ని వృద్ధి చేస్తుంది

Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
 
అపామార్గ పత్రం - సకల చర్మరోగాలను తగ్గించేందుకు ఈ పత్రి ఉపయోగపడుతుంది

చూతపత్రం ( మామిడి) - పాదాల నొప్పిని నివారించేందుకు ఉపయోగపడుతుంది

కరవీర పత్రం - చండ్రు తగ్గించే ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి

విష్ణుక్రాంతపత్రం - దగ్గు, జ్వరాన్ని నివారించేందుకు ఈ ఆకుల నుంచి వీచే గాలి చాలు..

దాడిమీపత్రం - వాత పిత్త కఫ దోషాలను నివారించేందుకు ఈ పత్రి ఉపయోగపడుతుంది

దేవదారుపత్రం - ఈ పత్రి నుంచి తీసిన నూనె చర్మ సమస్యలు, పేగులో ఉండే పుండ్లును నివారిస్తుంది.. కండరాలను బలంగా మారుస్తుంది. 

మరువకపత్రం - చెవికి సంబంధించిన ఇబ్బందులు తగ్గించేందుకు మరువకపత్రం ఉపయోగపడుతుంది

సింధువారపత్రం - పంటికి సంబంధించిన సమస్యలు తగ్గిస్తుంది

జాజిపత్రి - శరీరంపై దెబ్బల ద్వారా వచ్చే వాపుని నివారిస్తుంది
 
గండకీపత్రం - నులిపురుగుల నివారణకు గండకీపత్రిని వినియోగిస్తారు
 
శమీపత్రం - మాడుపై ఉండే వేడిని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.. ఈ గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది

Also Read: బుద్ధి, జ్ఞానం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కోసం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించాలి!
 
అశ్వత్థపత్రం - శరీరంలో విషం విరుగుడుకు ఉపయోగపడుతుంది

అర్జునపత్రం - గుండెకు సంబంధించిన రుగ్మతల నుంచి ఉపశమనం కోసం అర్జునపత్రం కషాయాన్ని వినియోగిస్తారు

అర్కపత్రం - సూర్యుడికి ప్రియమైన తెల్లజిల్లేడులో ఔషధం..శరీరంలో కాంతిని పెంచుతుంది

తులసీదళం - తులసి వల్ల ఉపయోగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సకల అనారోగ్య సమస్యలకు తులసీదళం ఉపయోగపడుతుంది . అయితే సాధారణంగా వినాయకుడిని తులసితో పూజించరు కానీ.. వినాయకచవితి ఒక్కరోజు మాత్రం తులసిని సమర్పిస్తారు
 
వినాయక పూజలో భక్తికన్నా ప్రకృతి పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. అందుకే మట్టి విగ్రహాన్ని పూజకు వినియోగించి.. ప్రకృతిలో దొరికే ఆకులతో పూజ చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. వానాకాలం కావడంతో కొత్తనీటిలో ఉండే బ్యాక్టీరియాను నివారించి నీటిని శుద్ధి చేసేందుకు ఈ పత్రి ఉపయోగపడుతుంది. నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget