Festivals In Bhadrapada 2024: వినాయకచవితి సహా భాద్రపదమాసం (సెప్టెంబర్) లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే!
Festivals In September 2024: భాద్రపదమాసం ఆరంభం అయిందంటే చాలు వినాయకనవరాత్రుల సందడి మొదలవుతుంది.. ఈ నెలలో ఇంకా ఏ ఏ పండుగలున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం...
Festivals In September 2024: సెప్టెంబరు 2 న మొదలైన అమావాస్య సెప్టెంబరు 3 సూర్యోదయానికి ఉండడంతో భాద్రపద మాసం సెప్టెంబరు 04 బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. అక్టోబరు 02 మహాళయ అమావాస్యతో భాద్రపద మాసం పూర్తవుతుంది. సాధారణంగా భాద్రపదమాసం అనగానే అందరకీ గుర్తొచ్చేది వినాయక నవరాత్రులే కానీ ఈ నెలలో ఇంకా చాలా పండుగలున్నాయి..
భాద్రపదమాసం శుద్ధ విదియ 2024 సెప్టెంబరు 07 వినాయకచవితి
విఘ్నాధిపతి గణపతి పుట్టినరోజు. ఈ రోజు వాడవాడలా బొజ్జగణపయ్య కొలువుతీరి పూజలందుకుంటాడు. హిందువుల ఇళ్లలో విగ్రహాలను ప్రతిష్టించి శక్తికొలది పూజిస్తారు. ప్రకృతిలో దొరికే ఆకులు, పండ్లుతో పార్వతీ తనయుడిని పూజించి ఆశీస్సులు అందుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్లు , వివిధ పిండివంటలు నైవేద్యంగా సమర్పించి...పూజ చేసి కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకుంటారు..
Also Read: తారక్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ దర్శించుకున్న 'శ్రీ కేశవనాథేశ్వర' గుహ ఆలయం విశిష్టత ఇదే!
భాద్రపద శుద్ధ పంచమి 2024 సెప్టెంబరు 08 రుషి పంచమి
మనిషిగా జన్మించినందుకు తీర్చుకోవాల్సిన మూడు రుణాల్లో ఋషి రుణం ఒకటి. వీళ్లను స్మరించుకునే రోజే రుషిపంచమి. ఈ రోజు వేకువజామునే స్నానమాచరించి వినాయకపూజ చేసిన తర్వాత గురువులను పూజిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే అన్నీ మంచిఫలితాలే పొందుతారు
భాద్రపద శుద్ధ ఏకాదశి 2024 సెప్టెంబరు 14 పరివర్తన ఏకాదశి
ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలకు ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఒక్కో విశిష్టత ఉంటుంది. భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును లక్ష్మీసమేతంగా పూజిస్తే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
భాద్రపద ద్వాదశి 2024 సెప్టెంబరు 15 వామన జయంతి
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావాతారాల్లో ఐదో అవతారం మొదటి మానవ అవతారం వామనుడు. బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి పాతాళానికి పంపించేసిన అవతారం విష్ణువు అవతారం ఇది . వామనజయంతిని కేరళరాష్ట్రంలో ఓనం పండుగగా వైభవంగా జరుపుకుంటారు.
భాద్రపద శుద్ధ చతుర్దశి 2024 సెప్టెంబరు 17 అనంత చతుర్దశి
ఈ రోజుతో వినాయక నవరాత్రులు ముగుస్తాయి..వాడవాడలా కొలువుతీరిన గణేషుడు గంగమ్మ ఒడికి తరలివెళ్లేరోజు ఇది..
Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
భాద్రపద పూర్ణిమ 2024 సెప్టెంబరు 18
ఈ ఏడాది సెప్టెంబర్ 18న భాద్రపద పూర్ణిమ..ఇదే రోజు చంద్రగ్రహణం. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు .నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
2024 సెప్టెంబరు 21 సంకటహర చతుర్థి భాద్రపద బహుళ చవితి
అమావాస్య ముందు వచ్చే చవితి రోజు సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగించే వ్రతం ఇది. చతుర్థి తిథి సూర్యాస్తయమ సమయానికి ఉండేలా చూసుకోవాలి..
2024 సెప్టెంబరు 28 అందరకీ ఏకాదశి భాద్రపద బహుళ ఏకాదశి
భాద్రపద అమావాస్య 2024 అక్టోబరు 02 మహాలయ అమావాస్య - బతుకమ్మ పండుగ ప్రారంభం
భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకూ మహాలయ పక్షం అంటారు. ఈ సమయంలో పితృదేవతారాధన చేస్తారు. దానధర్మాలు చేస్తారు...
Also Read: బుద్ధి, జ్ఞానం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కోసం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించాలి!