News
News
X

AFSPA Act: AFSP చట్టంలో ఏముంది? నాగాలాండ్‌లో ఓ లెక్క.. కశ్మీర్‌లో మరో లెక్క ఎందుకు?

నాగాలాండ్ కాల్పుల ఘటన తర్వాత AFSPAపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? ఈ చట్టంపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

AFSPA..  ప్రస్తుతం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. నాగాలాండ్​లో మిలిటెంట్లుగా భావించి పౌరులపై సాయుధ బలగాలు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధ్యతారాహిత్యమైన ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. ఈ మారణహోమంతో ప్రస్తుతం ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు AFSP చట్టం అంటే ఏంటి? ఏఏ ప్రాంతాల్లో ఇది అమలులో ఉంది.. అన్నీ చోట్లా ఒకేలా అమలవుతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

AFSP అంటే ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSP Act) అంటే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. 

ఈ చట్టం సాయుధ దళాలకు పౌరులపై అపారమైన విచక్షణాధికారాలను కట్టబెడుతుంది. మరి ఇది మంచిదే కదా? అనుకుంటున్నారా? అలా అనుకునే ముందు ఈ వివాదాస్పద చట్టం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

ఏంటి స్పెషల్..

AFSP చట్టం సమస్యాత్మక, అల్లర్ల, కల్లోల ప్రాంతాలను నియంత్రించడానికి సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. ఏదైనా ఓ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉందని అభిప్రాయపడినప్పుడు.. ఆ ప్రాంత పౌరులకు సహాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. 

ఈ చట్టం సాయుధ బలగాలకు కాల్పులు జరపడానికి, వారెంట్ లేకుండా ఎక్కడికైనా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అందించే ప్రత్యేకమైన అధికారాలతో వీరు ఏం చేసినా చట్టపరమైన చర్యలను ఫేస్ చేయరు.

ఎక్కడ అమలులో ఉంది?

ఏదైనా ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్‌డ్ ఏరియాగా ప్రకటించిన తర్వాత అక్కడ AFSP చట్టాన్ని అమలు చేయవచ్చు. ఒక భూభాగాన్ని డిస్టర్బ్‌డ్ ఏరియా అని ప్రకటించే అధికారం మొదట రాష్ట్రాలకు ఉంది. కానీ 1972లో ఈ అధికారం కేంద్రానికి బదిలీ అయ్యింది. 

ప్రస్తుతం ఏఎఫ్‌ఎస్‌పీఏ జమ్మూ&కశ్మీర్, నాగాలాండ్, అసోం, ఇంఫాల్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మణిపూర్ వ్యాప్తంగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో అమలులో ఉంది.

ఎందుకు వివాదాస్పదమైంది?

సాయుధ బలగాలకు అడ్డూ అదుపూ లేని అధికారాన్ని ధార పోసే ఏఎఫ్‌ఎస్‌పీఏని అమానుష చట్టంగా అభివర్ణిస్తూ ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు పౌరులు. ఈ చట్టం ఇచ్చే అధికారం ముసుగులో ఎన్నో తప్పులు చేస్తూ సాయుధ బలగాలు తరచుగా శిక్షల నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఏఎఫ్‌ఎస్‌పీఏ నిబంధనల ప్రకారం, సాయుధ దళాలు కేవలం అనుమానంతోనే ఏ భవనాన్ని అయినా నాశనం చేయొచ్చు లేదా కాల్చవచ్చు. అనుమానం, అభిప్రాయం ఉంటే చాలు నాన్-కమిషన్డ్ ఆఫీసర్ లేదా అదే ర్యాంక్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఎవరైనా వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు లేదా చంపొచ్చు. తరువాత ఎటువంటి ప్రాసిక్యూషన్ ఏర్పాటు ఉండదు.

అక్కడొకలా.. ఇక్కడోలా..

ప్రస్తుతం ఈ చట్టం అటు జమ్ముకశ్మీర్‌లో ఇటు నాగాలాండ్‌లో రెండు చోట్లా అమలులో ఉంది. కానీ రెండు చోట్ల ఒకే తరహాలో అమలులో లేదనేది చాలా మంది హక్కుల కార్యకర్తలు, ప్రజలు చెబుతోన్న మాట. ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి జమ్ముకశ్మీర్‌లో పౌరులపై ఎన్నో అరెస్ట్‌లు, అనుమానాస్పద ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ ఏనాడు కేంద్రం, ఆర్మీ క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు.

కానీ ఇటీవల నాగాలాండ్‌లో పౌరులపై బలగాలు చేసిన కాల్పుల ఘటనలో మాత్రం కేంద్రం, ఆర్మీ కాస్త భిన్నంగా స్పందించింది. ఆగమేఘాలపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయడం. తప్పిదం జరిగిందని ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆర్మీ కూడా క్షమాపణలు కోరింది. మరి చట్టం ఒకటై అయినప్పుడూ అన్నీ చోట్లా ఒకేలా అమలుకాకపోవడం కూడా చర్చనీయాంశమే.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఏఎఫ్‌ఎస్‌పీఏని మొండిగా కొనసాగిస్తున్న ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 2016లో చీవాట్లు పెట్టింది. చట్టం భద్రతా బలగాలకు స్వేచ్ఛనిస్తుందనే భావనలో లోపాలున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది. మణిపూర్‌లో గత 20 ఏళ్లలో 1,500కి పైగా బూటకపు ఎన్‌కౌంటర్‌ల కేసులపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై సుప్రీం కోర్టు ఎప్పుడూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది.

Also Read: AFSPA Act: AFSP చట్టంలో ఏముంది? నాగాలాండ్‌లో ఓ లెక్క.. కశ్మీర్‌లో మరో లెక్క ఎందుకు?

Also Read: Gen Bipin Rawat Last Rites LIVE: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు

Also Read: Omicron Cases India: దేశంలో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు 624 మంది మృతి

Also Read: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?

Also Read: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం

Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు

Also Read: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు

Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 05:29 PM (IST) Tags: nagaland violence What is AFSPA Armed Forces Special Powers Act AFSPA Act AFSP

సంబంధిత కథనాలు

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

రాహుల్‌పై అనర్హతా వేటు తప్పదా? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమూ కోల్పోతారా?

రాహుల్‌పై అనర్హతా వేటు తప్పదా? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమూ కోల్పోతారా?

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

సీఈవోకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు, ఆ డిమాండ్‌లు తీర్చాల్సిందేనంటూ ఓపెన్ లెటర్

సీఈవోకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు, ఆ డిమాండ్‌లు తీర్చాల్సిందేనంటూ ఓపెన్ లెటర్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'