Pain Killers: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు
కొందరు పెయిన్ కిల్లర్స్ కి బానిసలుగా మారుతున్నారు. చిన్న నొప్పికి కూడా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. దీనివల్ల తీవ్ర ఆరోగ్యసమస్యలు మొదలవ్వచ్చు.
భరించలేని నొప్పిని తట్టుకునేందుకు ఇస్తారు పెయిన్ కిల్లర్స్. కానీ ఇప్పుడు అవి సాధారణ జలుబు, దగ్గు మాత్రల్లా మారిపోయాయి. చిన్న తలనొప్పి వచ్చినా, చేయి నొప్పి పెట్టినా పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నారు చాలా మంది జనాలు. పెయిన్ కిల్లర్స్ అతిగా ఉపయోగించడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవి శ్వాన తీసుకోవడాన్ని, శారీరక ప్రతిచర్యలను నెమ్మది చేస్తాయి. అంతేకాదు మాటలు కూడా అంత స్పష్టంగా, పదునుగా రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలోని ప్రధాన అవయవాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
కాలేయం
మీరు తీసుకునే పెయిన్ కిల్లర్స్ విచ్చిన్నం చేసేది కాలేయమే. ఆ ప్రాసెస్‌లో కాలేయం ఔషధాలలోని ప్రమాదకరమైన పదార్థాలను నిల్వ చేస్తుంది. ఇది ప్రాణాంతకమైన కాలేయ వ్యాధికి దారితీయవచ్చు.
గుండె
కొందరు తక్షణమే నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ మందులను పొడి రూపంలో తీసుకోవడం లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఔషధం నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇది గుండెపై ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలికంగా ఇలా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
పొట్ట
పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకోవడం వల్ల పొట్ట, పేగు సంబంధింత సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పేగులో అడ్డుంకులు, హేమరాయిడ్లు వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
రక్త నాళాలు
ముఖ్యంగా సిరలకు పెయిన్ కిల్లర్స్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఓపియాయిడ్ వంటి పెయిన్ కిల్లర్స్ ను రక్త నాళాల్లోకి ఇవ్వడం వల్ల సిరల్లో సమస్యలు రావడం, ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు దారితీయవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Read Also: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి