Gen Bipin Rawat Last Rites LIVE: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
సీడీఎస్ బిపిన్ రావత్ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాజకీయ, సైనిక రంగానికి చెందిన ఎంతోమంది ఆయనకు పుష్పాంజలి ఘటిస్తున్నారు.

Background
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో కాసేపట్లో జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు.
రావత్ దంపతుల భౌతికకాయాలకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించనున్నారు. తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల నివాళి..
తమిళనాడు కూనూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కు తీసుకువచ్చారు. ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.
India will never forget their rich contribution, says PM Modi after paying last respects to CDS Rawat, 12 others killed in TN chopper crash
— ANI Digital (@ani_digital) December 9, 2021
Read @ANI Storyb | https://t.co/RF9NVIxM9w#CDSGeneralBipinRawat #HelicopterCrash pic.twitter.com/YQvC11JM04
అంతకు ముందు ఎయిర్‌బేస్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
The 3 service chiefs - Army Chief Gen MM Naravane, Navy Chief Admiral R Hari Kumar & IAF chief Air Chief Marshal VR Chaudhari pay last respects to CDS Gen Bipin Rawat, his wife Madhulika Rawat & other 11 Armed Forces personnel who lost their lives in military chopper crash y'day. pic.twitter.com/HoXt8Jw0U6
— ANI (@ANI) December 9, 2021
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
వీడ్కోలు వీరుడా..
సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్‌కు వీడ్కోలు పలికారు. భారతమాత ముద్దు బిడ్డకు యావత్ దేశం నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు పాల్గొన్నారు.
Delhi: Daughters of #CDSGeneralBipinRawat and Madhulika Rawat - Kritika and Tarini - pay tribute to their parents. Other members of the family also join them in paying last respects. pic.twitter.com/Wc88k8oZaF
— ANI (@ANI) December 10, 2021
అంతిమయాత్ర..
బిపిన్ రావత్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ప్రజలంతా రహదారికి ఇరు వైపులా జాతీయం జెండాలతో నిల్చొని బిపిన్ రావత్ గురించి నినాదాలు చేస్తున్నారు.
#WATCH | Delhi: Citizens raise slogans of "Jab tak suraj chaand rahega, Bipin ji ka naam rahega", as the cortège of #CDSGeneralBipinRawat proceeds towards Brar Square crematorium in Delhi Cantonment. pic.twitter.com/s7sjV4vg73
— ANI (@ANI) December 10, 2021





















