News
News
X

Type-1 Diabetes: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?

వారసత్వంగా చిన్నవయసులోనే దాడిచేసే భయంకర ఆరోగ్యపరిస్థితి టైప్1 డయాబెటిస్.

FOLLOW US: 

డయాబెటిస్ మూడు రకాలు... టైప్1, టైప్2, జెస్టేషనల్ డయాబెటిస్. ఇందులో జెస్టేషనల్ కేవలం మహిళల్లో గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇక టైప్ 2 పెద్ధవాళ్లలో ఎప్పుడైనా రావచ్చు. టైప్ 1 డయాబటిస్ అనే చిన్నపిల్లల్లో కలిగేది. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. టైప్ 1 మధుమేహం ఉన్న పిల్లల్లో ప్రాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. దీని వల్ల ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే టైప్1 లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. లేకుంటే కంటిచూపు మందగించడం వంటి సమస్యలు మొదలవుతాయి. 

లక్షణాలు...
1. విపరీతమైన ఆకలి
2. అలసట
3. బరువు తగ్గడం
4. తరచూ మూత్రానికి వెళ్లడం
5. రాత్రిళ్లు పక్క తడపడం
6. దాహం పెరగడం
7. వారి నోటి నుంచి తీపి వాసన రావడం

ఏం తినిపించాలి?
టైప్ 2 డయాబెటిస్ లానే టైప్ 1 మధుమేహం ఉన్నవారికి కూడా ఆహారంలో మార్పులు చేయక తప్పదు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తినాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా పెరుగుతాయి. 
1. అతిగా తినడం లేదా పూర్తిగా తినక పోవడం చేయకూడదు. 
2. చక్కెర, బెల్లం, శుద్ధి చేసిన పిండి ఉత్పత్తులు, పండ్ల రసాలు తినిపించకూడదు. 
3. కొద్దిగా కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్లు, తక్కువ కొవ్వులతో కూడిన సమతుల్యమైన భోజనం పెట్టాలి. 
4. కంచంలో యాభై శాతం కూరగాయలతో వండిన వంటకాలు, పాతిక శాతం ప్రోటీన్లు నిండిన ఆహారం, మిగతా పాతిక శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉండాలి. 
5. మధ్యాహ్నం తినే ఆహారం చాలా ముఖ్యం.ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఇన్సులిన్ ఇవ్వరు. 
6. రోజుకు పది నుంచి 12 గ్లాసుల నీరు తాగించాలి.
7. ప్రోటీన్ల కోసం గుడ్లు, మాంసం, సోయా ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులపై ఆధారపడాలి. 

గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ ఉండే ఆహారాలు ఇవే...
55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు డయాబెటిస్ రోగులకు మంచివి. తక్కువ ఇండెక్స్ ఉన్న కూరగాయలు ఇవిగో...
1. క్యాబేజ్ (జీఐ 10)
2. కాలి ఫ్లవర్ (జీఐ 10)
3. టమోటా (జీఐ 10)
4. బెండకాయ (జీఐ 20)
5. ఫ్రెంచ్ బీన్స్ (జీఐ 15)

వీటితో వండిన వంటకాలను పిల్లలు అధికంగా తినిపించినా మంచిదే. టైప్ 1 డయాబెటిస్ పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. 

Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం

Read Also: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు

Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు

Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...

Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 07:31 AM (IST) Tags: Type-1 diabetes Kids diabetes Type 1 causes Type 1 Symptoms టైప్ 1డయాబెటిస్

సంబంధిత కథనాలు

Krishnashtami Recipes: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు

Krishnashtami Recipes: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Banana: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త

Banana: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త

Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే

Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే

Heathy Heart: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి

Heathy Heart: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి

టాప్ స్టోరీస్

BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

BJP :  పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ -  గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు