Omicron Cases India: దేశంలో 26కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి
గుజరాత్‌లో తాజాగా మరో 2 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా ముంబయిలో మరొకరికి ఈ వేరియంట్ సోకింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరింది. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ముంబయి ధారావిలో ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్లు వెల్లడైంది.
One #Omicron case found in Dharavi area of Mumbai. The person had returned from Tanzania; now admitted at SevenHills Hospital: BMC (Brihanmumbai Municipal Corporation)
— ANI (@ANI) December 10, 2021
Overall 25 Omicron cases in the country so far. All detected cases have mild symptoms. Less than 0.04% of total variants detected: Lav Agarwal, Joint Secy, Union Health Ministry pic.twitter.com/UJV1NGsVi5
— ANI (@ANI) December 10, 2021
Surveillance, effective screening, monitoring of international travellers and health infrastructure upgradation is being done. States have been notified to increase their surveillance and actively test passengers arriving from other countries: Lav Aggarwal, Joint Secy pic.twitter.com/JXgAVoUUc8
— ANI (@ANI) December 10, 2021
ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో దగ్గరగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా వెల్లడైంది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని లక్షణాలేవీ లేవని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు.
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువైతే మరో వేవ్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించాయి.
Also Read: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Also Read: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం
Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు
Also Read: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు
Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి