అన్వేషించండి

Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు

Tiger Caught in West Bengal | జాడ తెలుసుకునేలోపే మరో ప్రాంతానికి వెళ్తున్న జీనత్ అనే ఆడపులిని మూడు వారాల తరువాత అధికారులు బంధించారు. పశ్చి బెంగాల్‌లోని బంకురా జిల్లాలో బంధించారు.

కోల్‌కతా: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్‌ రిజర్వ్‌ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి పశ్చిమ బెంగాల్‌లో పులి చిక్కడంతో ఊపరి పీల్చుకున్నారు.  21 రోజుల్లో 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లపైగా ప్రయాణించిన పులి సమస్యకు చెక్ పెట్టారు. 

మహారాష్ట్ర నుంచి ఒడిశాకు తరలింపు

అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఓ ఆడ పులిని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. జీనత్ అనే ఆడపులి వయసు మూడేళ్లు. ఈ క్రమంలో సిమ్లీపాల్‌ టైగర్‌ రిజర్వ్‌ నుంచి డిసెంబరు 8న ఆడ పులి తప్పించుకుంది. దాంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఆడపులి కొన్ని రోజులు ఒడిశాలోనే సంచరించినా తరువాత ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. ఝార్ఖండ్ ప్రజలతో పాటు అటవీశాఖ అధికారులను వారం రోజులపాటు హడలెత్తించింది. పులి పాదముద్రలు గుర్తించేలోపే మకాం మార్చేసేది. దాంతో పులి జాడ కనిపెట్టడం కష్టతరంగా మారడంతో పట్టుకోలేకపోయారు.

మత్తు మందు ఇచ్చి బంధించిన అధికారులు

వారం రోజులపాటు ఝార్ఖండ్‌లో సంచరించిన పులి మరో వంద కిలోమీటర్లు పైగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. మొదట ఝార్‌గ్రామ్‌లో స్థానికుల్ని హడలెత్తించిన పులి చివరగా అటవీశాఖ అధికారులకు దొరికింది. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. ఆదివారం నాడు అధికారుల ప్రయత్నం ఫలించింది. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారం తెలియడంతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులను అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. పులిని బంధించి, ప్రజలను రక్షించిన ఈ ఆపరేషన్‌లో భాగమైన అందరికీ మమత అభినందనలు తెలిపారు.

Also Read: Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: కేబినెట్ భేటీ వాయిదా- నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం
Telangana Assembly Special Session: కేబినెట్ భేటీ వాయిదా- నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: కేబినెట్ భేటీ వాయిదా- నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం
Telangana Assembly Special Session: కేబినెట్ భేటీ వాయిదా- నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Embed widget