Eating Disorder: ఆమె మొహం నిండా మొటిమలే కానీ అది స్కిన్ డీసీజ్ కాదు
అతిగా తింటే బరువు పెరుగుతారు. కానీ ఈమెకి ఉన్న వ్యాధి వల్ల బరువు పెరగడం కాదు మొహం నిండా మొటిమలు లాంటి గడ్డలు వచ్చి ఎర్రగా మారిపోయింది.
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఈటింగ్ డిజార్డర్. ఎంత తింటున్నాం ఏం తింటున్నామో తెలియకుండా కుంభాలు కుంభాలు తినేస్తారు. 20 ఏళ్ల చార్లీ షానన్ బెడ్ ఫోర్డ్ కూడా 12 సంవత్సరాల నుంచి ఈటింగ్ డిజార్డర్ తో బాధపడుతుంది. అయితే ఈమె బాధ మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా ఆమె మొహం నిండా గడ్డలు లాంటి మొటిమలు వచ్చి బాధకారంగా మారింది. అంతే కాదు శరీరంలోని పోషకాహార లోపం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీని వల్ల ఆమె మొహం ఎర్రగా మారిపోయింది విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఆఖరికి ఆమె తల ఎత్తడానికి ప్రయతించినప్పుడు కూడా నొప్పిగా ఉంటుందని వైద్యులు తెలిపారు. కాలక్రమేణా దాని వల్ల ఆమె శరీరంలో రక్త ప్రసారం సరిగా లేదని గుర్తించారు.
ఈటింగ్ డిజార్డర్ వల్ల మొటిమలు వస్తాయా?
చార్లీ గడ్డం, బుగ్గలపై గడ్డలు అభివృద్ధి చెందాయి. మొహం మంటల్లో వేసినట్టు కాలిపోతున్నంతగా మండిపోతుంది. కొద్ది సేపటి తర్వాత ఆమె ముఖం ఉబ్బడం ప్రారంభమైంది. కాసేపటికి ఆమె మాట్లాడలేకపోయింది. ఈ నరకం 2020-2022 వరకు కొనసాగింది. ఫేస్ మాస్క్, ఐస్ రాస్తున్నప్పుడు ఆమె తన కనుబొమ్మ మీద ఒక చిన్న గడ్డ ఉండటాన్ని గమనించింది. తినే రుగ్మత కారణంగా ఆమె శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీన్ని ల్యూకో సైటోసిస్ అంటారు. ఈటింగ్ డిజార్డర్ వల్ల వచ్చే ఈ వ్యాధిని ఆహార ల్యూకోసైటిస్ అంటారు. దీని వల్ల శరీరమంతా రక్తం ప్రయాణించకుండా సరఫరా ఆగిపోతుంది.
ల్యూకోసైటిస్ అంటే ఏంటి?
ల్యూకోసైటిస్ అనేది శరీరంలో అధిక మొత్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ని కలిగి ఉంటుంది. దీంతో గాయాలు, వాపు, ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి లోపాలు ఏర్పడతాయి. ఈటింగ్ డిజార్డర్ వల్ల ఏర్పడిన మొటిమలు తగ్గించుకునేందుకు చార్లీ 2023 చికిత్స తీసుకుంటుంది.
తినే రుగ్మత లక్షణాలు
⦿అతిగా తింటారు
⦿డైట్ మీద ఆసక్తి ఉండదు
⦿తరచూ బరువు పేరుగుతున్నామనే ఫిర్యాదులు వస్తాయి
⦿అందరితో కలిసి కూర్చోకుండా ఒంటరిగా తింటారు
⦿భారీగా భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపించడం
⦿భోజనం తర్వాత వికారం, వాంతులు
ఈటింగ్ డిజార్డర్ అనేది ఒక మానసిక వ్యాధి. దీని వల్ల ఆహారం తీసుకునేటప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల తల తిరగడం ఎక్కువగా ఉంటుంది. ఈటింగ్ డిజార్డర్ చాలా ప్రమాదకరం. చికిత్స తీసుకోకపోతే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడతారు. ఇలా అతిగా తినే రుగ్మత కలిగిన వాళ్ళు మానసిక వైద్యులను కలిసి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ పనులు అతిగా చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందట, జాగ్రత్త