అన్వేషించండి

Earth Day 2026 : ధరత్రీ దినోత్సవం 2026.. చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే

Earth Day : పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతూ ప్రతి ఏడాది Earth Day నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త థీమ్​తో దీనిని సెలబ్రేట్ చేస్తున్నారు, దీనిగురించిన మరిన్ని విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రకృతి వనరుల క్షీణత, కాలుష్యం నేపథ్యంలో భూమిని కాపాడాలని ధరత్రీ దినోత్సవం గుర్తుచేస్తుంది.
  • పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఒక్కరిదే కాదు, అందరిదని 'Our Power, Our Planet' థీమ్ చెబుతుంది.
  • 1970లో అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం, నేడు ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమంగా మారింది.
  • ప్రజలకు అవగాహన కల్పించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడమే దీని లక్ష్యం.

Earth Day 2026 Theme Our Power and Our Planet : మనిషి ఎంత అభివృద్ధి చెందినా.. ప్రకృతి లేకుండా జీవించడం అసాధ్యం. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా భూమి మీద సహజ వనరులు క్రమంగా తగ్గిపోతున్నాయి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ.. ప్రతి ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ధరత్రీ దినోత్సవం (Earth Day) జరుపుతున్నారు. ఇది మనందరికీ ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.

స్థానిక వ్యవస్థలైన నగరాలు, పాఠశాలలు, గిరిజన సమాజాలు, శక్తి వినియోగాన్ని మెరుగుపరచడం, సహజ వనరులను సంరక్షించడం, ప్రమాదాలను తగ్గించడం వంటి పరిష్కారాలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఇవి ఆర్థిక ప్రయోజనాలు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే కేవలం ధరత్రీ దినోత్సవం కోసం ఎదురుచూడకుండా.. పర్యావరణ పరిరక్షణ కోసం అందుబాటులో ఉన్న వనరులు, చర్యలను రెగ్యులర్​గా ఫాలో అవ్వాలని చెప్పడమే దీని లక్ష్యం. 

Earth Day 2026 థీమ్

ధరత్రీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది కొత్త థీమ్​తో జరుపుతారు. ఈ ఏడాది "Our Power, Our Planet” అనేది Earth Day 2026 థీమ్​తో వస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క ప్రభుత్వంపైనా లేదా ఎన్నికలపైనా ఆధారపడదు అనే సత్యాన్ని సూచిస్తుంది. 
ఇది మనందరి రోజువారీ చర్యల మీద ఆధారపడి ఉంటుందని.. దీనికోసం సమాజాలు, ఉపాధ్యాయులు, కార్మికులు, కుటుంబాలు కలిసి తమ నివాస ప్రాంతాలను, పని చేసే ప్రదేశాలను కాపాడేందుకు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పర్యావరణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాయనే థీమ్​ని తీసుకువచ్చారు. 

ధరత్రి దినోత్సవం చరిత్ర

ధరత్రి దినోత్సవాన్ని 1970లో అమెరికాలో మొదటిసారి జరిపారు. ఆ సమయంలో పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిసారి జరిపిన Earth Dayలో సుమారు 2 కోట్ల మంది పాల్గొన్నారు. తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి గ్లోబల్ ఉద్యమంగా మారింది. 

ధరత్రి దినోత్సవం ప్రాముఖ్యత

పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచి.. వాతావరణ మార్పుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు దీనిని నిర్వహిస్తారు. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి. 

ఇంట్రెస్టింగ్ విషయాలు 

ఈ ధరత్రి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటివాటిపై చర్చలు చేస్తారు. మొక్కలు నాటడం, క్లీనప్ డ్రైవ్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ Earth Day అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా గుర్తింపు పొందింది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget