Dry Hair : డ్రై హెయిర్ వల్ల జుట్టు రాలిపోతుందా? ఈ సహజ చిట్కాలతో సాఫ్ట్, షైనీ హెయిర్ పొందండిలా
Natural Remedies for Dry Hair : జుట్టు పొడిబారితే నిర్జీవంగా మారి.. ఎక్కువ రాలిపోతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టుకు మాయిశ్చరైజర్ అందించి.. సాఫ్ట్, షైనీ హెయిర్ పొందవచ్చు.

- పొడి, చిట్లిన జుట్టుకు సహజసిద్ధమైన కలబంద, గుడ్డు, పెరుగు వాడండి.
- వేడి నీళ్లు, కెమికల్ ఉత్పత్తులు వాడకం తగ్గించి, నీళ్లు ఎక్కువగా తాగండి.
- ఆరోగ్యకరమైన ఆహారం, నూనె మసాజ్, ఒత్తిడి తగ్గించుకోవాలి.
- సెలూన్ ట్రీట్మెంట్ల కంటే ఇంటి చిట్కాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయి.
Simple Tips for Soft and Healthy Hair : జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాంటి వాటిలో డ్రై, రఫ్ హెయిర్ అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. శరీరానికి తగిన ఆహారం ఇవ్వకపోవడం, అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్, కాలుష్యం, దుమ్ము, మట్టి వంటి బాహ్య కారణాలు ఈ సమస్యను మరింత రెట్టింపు చేస్తాయి. అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడక్ట్స్, సింథటిక్ ట్రీట్మెంట్స్ కూడా జుట్టును బాగా డ్యామేజ్ చేస్తాయి.
హెయిర్ బాగా డ్రైగా ఉన్నప్పుడు చాలామంది సెలూన్ ఆశ్రయిస్తారు. అయితే ఈ సెలూన్ ట్రీట్మెంట్స్ తాత్కాలిక ఫలితాలు ఇస్తాయి కానీ.. కొన్నిసార్లు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ పెంచుతాయి. అందుకే సహజమైన ఇంటి చిట్కాలతో జుట్టును ఎలా కాపాడుకోవచ్చో.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం.. ఎక్స్‌ట్రీమ్ డ్రై హెయిర్‌కు కోసం ఫాలో అవ్వాల్సిన సహజ చిట్కాలు చూసేద్దాం.
కలబంద..
కలబంద జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. జుట్టు డ్యామేజ్‌ను రిపేర్ చేసి సాఫ్ట్‌గా మార్చుతుంది. తాజా అలొవెరా జెల్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి కొంతసేపు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే జుట్టు పొడిబారడం తగ్గుతుంది. జుట్టు సిల్కీగా మారుతుంది.
గుడ్డు
గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్ నిండుగా ఉంటాయి. ఇవి జుట్టుకు డీప్ నరిష్మెంట్ ఇస్తాయి. రెగ్యులర్‌గా గుడ్డును మాస్క్‌గా వేసుకుంటే జుట్టు దృఢంగా, సిల్కీగా అవుతుంది. ఒక గుడ్డును బీట్ చేసి జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వేడి నీటితో అస్సలు వాష్ చేయకూడదు.
పెరుగు
పెరుగు నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. డాండ్రఫ్ డర్ట్‌ను తొలగిస్తుంది. డ్రై హెయిర్‌కు మాయిశ్చర్ అందిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేసి మైల్డ్ షాంపూతో కడగాలి.
బీర్
బీర్‌లో ఉన్న యీస్ట్ జుట్టుకు నేచురల్ షైన్ ఇస్తుంది. అలాగే డ్రై హెయిర్‌ను సాఫ్ట్‌గా మార్చుతుంది. కాబట్టి వారానికి ఒకసారి బీర్‌తో హెయిర్ వాష్ చేసినా మంచి ఫలితం చూడవచ్చు.
డ్రై హెయిర్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ జుట్టు ఎక్కువగా పొడిబారుతూ ఉంటే.. కెమికల్ షాంపూలు, హెయిర్ ప్రోడక్ట్స్ వాడడం మానుకోండి. అలాగే వేడి నీటితో తలస్నానం చేయకూడదు. ఇది డ్రైనెస్ పెంచుతుంది. హెయిర్ డ్రైయర్.. స్ట్రెయిటెనర్ వాడకం తగ్గించండి. హైడ్రేషన్ చాలా ముఖ్యం కాబట్టి నీళ్లు ఎక్కువ తాగండి. ప్రోటీన్, విటమిన్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. గుడ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు డైట్లో చేర్చుకోవాలి.
వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయండి. ఒత్తిడి కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. స్ట్రెస్ తగ్గించుకోండి. డ్రై హెయిర్ సమస్యను పూర్తిగా తగ్గించుకోవాలంటే సహజ చిట్కాలను రెగ్యులర్‌గా పాటించడం ముఖ్యం. కొంచెం టైం పడినా, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాల ప్రయోజనాలు ఇస్తాయి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















