అన్వేషించండి

Fenugreek Water to Burn Fat : ప్రతిరోజూ మెంతుల నీరు తాగితే పొట్ట తగ్గుతుందా? నిపుణుల సూచనలు ఇవే

Belly Fat Reduction : పొట్ట ఎక్కువగా ఉంటే.. లుక్ పాడవడమే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే దీనిని తగ్గించుకోవాలంటే మెంతుల నీరు తాగితే మంచిదా? ఎలా పని చేస్తుంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెంతుల నీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.
  • మెంతుల్లోని పీచుపదార్థం ఆకలిని నియంత్రించి, కొవ్వును కరిగిస్తుంది.
  • మెంతులు జీవక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
  • మెంతులు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

Fenugreek Water for Weight Loss : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ అనేది ఓ ప్రధాన సమస్యగా మారింది. దీన్ని తగ్గించుకోవడానికి చాలామంది సహజ మార్గాలను వెతుకుతుంటారు. అలాంటి వాటిలో ఎక్కువగా వినిపించే ఇంటి చిట్కా మెంతుల నీరు అని చెప్పవచ్చు. అయితే దీనిని ప్రతిరోజూ తాగితే నిజంగా పొట్ట తగ్గుతుందా? పొట్ట తగ్గించుకోవడానికి నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో చూసేద్దాం. 

ఊబకాయం, పొట్ట అనేది మీ వ్యక్తిత్వాన్ని పాడు చేయడమే కాకుండా.. అనేక వ్యాధులకు కారణమవుతాయి. అందుకే దీనిని కంట్రోల్ చేయడం ముఖ్యం. ఈ సమయంలో లైఫ్​స్టైల్​లో చేసే చిన్ని మార్పులు బరువు తగ్గడానికి, ముందుకు పొడుచుకు వచ్చిన పొట్టను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటిలో మెంతుల వాడకం కూడా ఒకటి. 

మెంతులతో ఫ్యాట్ తగ్గుతుందా?

మెంతులలో కరిగే పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వాటిని తినడం వలన కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి.. ఆకలి వేయడాన్ని నివారిస్తుంది. మీరు ప్రతిరోజూ మెంతులను తీసుకుంటే.. దీర్ఘకాలంలో మీ పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవచ్చు.

మెంతుల్లోని పోషకాలు

మెంతుల్లో ఫైబర్‌తో పాటు, రాగి, రైబోఫ్లేవిన్, విటమిన్లు ఎ, బి6, సి, కె, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి కూడా మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరానికి లోపలి నుంచి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ మెంతుల నీటిని తాగితే.. తక్కువ సమయంలోనే మీ శరీరంలో మార్పులను ఖచ్చితంగా చూస్తారు.

మెంతుల వల్ల కలిగే మరిన్ని లాభాలు.. 

మెంతుల నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతమై, శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ నిల్వ తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. షుగర్ స్పైక్ తగ్గితే ఫ్యాట్ స్టోరేజ్ కూడా తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి.. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గించి చర్మానికి మేలు చేస్తుంది. 

మెంతులు తీసుకోవడానికి సరైన పద్ధతి.. 

మెంతులను తినడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే.. ఒకటి నుంచి రెండు టీస్పూన్ల మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం.. నానబెట్టిన గింజలు ఉన్న నీటిని కొద్దిగా వేడి చేసి.. వడకట్టి తాగాలి. మెంతులు కూడా నమిలి తింటే ఇంకా మంచిది. 

ఎక్కువగా తీసుకుంటే అసౌకర్యం రావచ్చు. గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకుని దీనిని ఉపయోగించాలి. షుగర్ లేదా ఇతర మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. రోజుకు చిన్న మోతాదులోనే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మెంతుల నీటితో పాటు సరైన డైట్, రెగ్యులర్ వ్యాయామం, హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే బరువు అదుపులో ఉండడంతో పాటు పొట్ట తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget