రోజూ 4 నానబెట్టిన బాదం తింటే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బాదంలో ఉండే న్యూట్రియెంట్స్ బ్రెయిన్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. మెమరీ, ఫోకస్ పెరుగుతాయి.

గుడ్ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్స్ గుండెను రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

విటమిన్ E వల్ల స్కిన్ హెల్తీగా, కాంతివంతంగా మారుతుంది.

తక్కువగా తిన్నా తృప్తి కలిగిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్టేబుల్‌గా ఉంటుంది.

ఉదయాన్నే 4 బాదం తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

బాదంలో ఉన్న పోషకాలు హెయిర్ గ్రోత్‌కి సహాయపడతాయి.

బాదాన్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే ఇంకా ఎక్కువ లాభాలు పొందవచ్చు.