మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వాళ్లు తాగకూడదు, ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri

లాక్టోజ్ అసహనం ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు జీర్ణం కానివారికి మజ్జిగ వల్ల గ్యాస్, బ్లోటింగ్, డయేరియా రావచ్చు.

జలుబు, దగ్గు ఎక్కువగా ఉండేవారు మజ్జిగ తాగకపోతే మంచిది. లేదంటే జలుబు, గొంతు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

లో బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తపోటును కొంచెం తగ్గిస్తుంది. దీనివల్ల కళ్లు తిరగవచ్చు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. మజ్జిగలో పొటాషియం ఉంటుంది.

అలర్జీలు ఉన్నవారికి స్కిన్ అలర్జీలు, ఇచింగ్ రావచ్చు.

రాత్రివేళ తాగేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీర్ణక్రియ మందగించి గ్యాస్ సమస్యలు రావచ్చు.

మజ్జిగలో ఎక్కువ ఉప్పు వేసుకుంటే బీపీ పెరగడం లేదా నీటి నిల్వ సమస్యలు వస్తాయి.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎసిడిటీ పెరిగి కడుపు మంట రావచ్చు.

ఎక్కువగా తాగితే ప్రయోజనం కన్నా హానీ ఎక్కువ. ఒక గ్లాస్ సరిపోతుంది.

మజ్జిగ వేసవిలో మంచి కూలింగ్ డ్రింక్ అయినా… అందరికీ సరిపోదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవడం మంచిది.