అన్వేషించండి

Chewing Gum Affect Male Fertility : మగవారిలో సంతాన సమస్యలకి చూయింగ్ గమ్ కారణమా? నిపుణులు ఇచ్చే హెచ్చరికలు ఇవే..

Chewing Gum Impact Male Fertility : టైమ్ పాస్​కి తినే చూయింగ్ గమ్ వల్ల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్తాయనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇది నిజంగానే మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతుందా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చూయింగ్ గమ్​లో సింథటిక్ పాలిమర్స్​తో మైక్రోప్లాస్టిక్స్​ చేరవచ్చు.
  • కొన్ని గమ్​లలో ప్లాస్టిక్ కణాలు శరీరం లోపలికి వెళ్లే అవకాశం ఉంది.
  • మైక్రోప్లాస్టిక్స్​ హార్మోన్​ల అసమతుల్యత, సంతాన సమస్యలకు కారణం కావచ్చు.
  • పరిమితంగా నమలడం, సహజ గమ్​లు వాడటం మేలు.

Chewing Gum Linked to Fertility Issues in Men : ప్రస్తుతం మనం ఉపయోగించే చాలా ప్రొడక్ట్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. చాలా ఫుడ్స్​లో కూడా అవి కలుస్తున్నాయి. తాజాగా చ్యూయింగ్ గమ్ కూడా ఈ జాబితాలో చేరిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ చూయింగ్ గమ్ తినడం వల్ల శరీరంలోకి చిన్న ప్లాస్టిక్ కణాలు చేరుతాయని.. అవి మగవారిలో సంతాన సమస్యలను పెంచుతుందనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో.. నిపుణులు ఏమంటున్నారో వారు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం.

మైక్రోప్లాస్టిక్స్ 

మైక్రోప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి ఆహారం, నీరు, గాలి ద్వారా కూడా మన శరీరంలోకి చేరవచ్చు. అలాగే కొన్ని చూయింగ్ గమ్‌లలో ఉపయోగించే సింథటిక్ పదార్థాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

చూయింగ్ గమ్​తో ప్రమాదమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్ని చూయింగ్ గమ్‌లు ప్రమాదకరమని చెప్పలేమని అంటున్నారు. కానీ కొన్ని గమ్‌లలో “గమ్ బేస్” అనే పదార్థం సింథటిక్ పాలిమర్స్‌తో తయారవుతుంది. వాటిని ఎక్కువగా నమిలితే.. అది చిన్న కణాలుగా విడిపోయి.. శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మగవారి ఫెర్టిలిటీపై ప్రభావం 

యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీలో 2025లో నివేదించిన అధ్యయనం ప్రకారం.. సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న మహిళల నుంచి సేకరించిన నమూనాలలో 69 శాతం, పురుషుల నుంచి సేకరించిన నమూనాలలో 55 శాతం మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో 2024లో చేసిన అధ్యయనంలో కూడా మానవ వృషణ కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు.

చూయింగ్ మగవారి సంతాన సమస్యలపై ప్రభావం చూపిస్తుందని పూర్తి స్థాయిలో నిర్ధారణ లేదు. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం.. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరితే హార్మోన్‌ల అసమతుల్యతకు కారణమవచ్చు. అలాగే టెస్టోస్టెరోన్ స్థాయిలపై ప్రభావం చూపి.. స్పెర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఫెర్టిలిటీపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచనలు

చూయింగ్ గమ్‌ను ఎక్కువగా నమలకుండా పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్తన్నారు నిపుణులు. అలాగే సహజమైన లేదా ప్లాంట్-బేస్డ్ గమ్‌లు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ తగ్గించాలని.. గ్లాస్ లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుని.. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని అంటున్నారు. ఇది పూర్తి ఆరోగ్యంతో పాటు.. హార్మోన్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుందని చెప్తున్నారు. 

అలాగే సంతానోత్పత్తి కేవలం వయస్సు లేదా ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉండదని.. మన చుట్టూ పరిసరాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. మీరు భవిష్యత్తులో తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ చిన్న అలవాట్లపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అత్యంత సాధారణంగా అనిపించే విషయాలు దీర్ఘకాలంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Coconut Laddu Recipe : బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
బెల్లం పాకంతో కొబ్బరి లడ్డూలు.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget