Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్ దగ్గర పడిందా? నిర్లక్ష్యమే కారణమా?
దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు.. థర్డ్ వేవ్ కు సంకేతాలా? మాస్కులు, కరోనా నిబంధనలు పాటించకపోవడమే కేసుల్లో పెరుగుదలకు కారణమా? కేరళ, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు కారణమేంటి?
మాస్క్ పెట్టుకోవాలా? భౌతిక దూరం పాటించాలా? ఆ.. ఇవన్నీ ఎందుకులే అని లైట్ తీసుకుంటున్నారా? అవును ప్రస్తుతం ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే.. మాస్కు లేని ఫేస్ లే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇలా కొంతమంది నిర్లక్ష్యమే కరోనా విజృంభణకు కారణమవుతుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
లోక్ సభలో నేడు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుంత దేశంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. దేశంలో కొవిడ్ వేరియంట్ లైన డెల్టా, డెల్టా ప్లస్ వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించారు. ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల డెల్టా వేరియంట్ విజృంభిస్తుందన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు.
ప్రస్తుతం కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో ఎక్కువ శాతం వాటా డెల్టా వేరియంట్లదే. దేశంలో వరుసగా మూడు రోజుల నుంచి 40వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు క్రమంగా పెరుతుండటం చూస్తే కరోనా థర్డ్ వేవ్ దగ్గరపెడుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా నింబధనలు పాటించకపోతే దేశం దారుణమైన థర్డ్ వేవ్ చూస్తుందని హెచ్చరిస్తున్నారు.
థర్డ్ వేవ్..
కొవిడ్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె సభకు వెల్లడించారు. ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అయినప్పటికీ కేంద్రం కావాల్సిన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పక్కా జాగ్రత్తలు చేపడుతుంది. ఎక్కడికక్కడ కొవిడ్ కేర్ సెంటర్లు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
1. కొవిడ్ కేర్ సెంటర్ (సీసీసీ)
2. డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్ (డీసీహెచ్ సీ)
3. డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్ (డీసీహెచ్)
ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నట్లు ఆరోగ్య సహాయ మంత్రి తెలిపారు. పరిశ్రమల్లో ఆక్సిజన్ వినియోగంపైనా ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ..
జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రాలు, యూటీలకు ఉచిత వ్యాక్సిన్ లు అందిస్తున్నామన్నారు. జులై 25 నాటికి 44.91 కోట్ల డోసులను రాష్ట్రాలు, యూటీలకు ఇచ్చామన్నారు.
3.83 లక్షల మందికి ఎలాంటి ఫొటో గుర్తింపు లేకపోయినా కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
ALSO READ:
Assam Mizoram Border Dispute: అసోం సీఎం, పోలీసు అధికారులపై కేసు నమోదు