Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నసహస్ర.. మాటిచ్చేసిన యమున, విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో సహస్రకు పద్మాక్షి వేరే పెళ్లి చేస్తానని చెప్పడంతో సహస్ర ఉరి వేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తండ్రి ఆదికేశవ్ విహారి, సహస్రల పెళ్లి ఆపుతారు. రాక్షస ముహూర్తమని ఈ రోజు మంచి రోజు కాదని చెప్తారు. ముక్కూ ముఖం తెలియని వ్యక్తి మాటలు వినడం ఏంటని పద్మాక్షి సహస్రని మండపంలో కూర్చొపెడుతుంది. విహారిని కూడా కూర్చొమని అంటుంది. యమున టెన్షన్ పడుతుంది.
ఆదికేశవ్ వాళ్లతో మీ ఇంట్లో తప్ప మరెక్కడా పెళ్లి జరగడం లేదని చెప్తారు. యమున భక్తవత్సలంలో ఒకసారి స్వామీజీకి అడగమని అంటుంది. భక్త వత్సలం స్వామీజీని ఇంటికి పిలుస్తారు. స్వామీజీ వచ్చి ఈ రోజు మంచి రోజు కాదని ఈ రోజు పెళ్లి జరిపిస్తే పెళ్లి చేసుకున్న జంట చనిపోతుందని వెంటనే పెళ్లి ఆపండి అని అంటారు. దాంతో భక్తవత్సలం పెళ్లి ఆపితేనే బెటర్ అంటారు. పంతులుతో అంబికనే ఈ ముహూర్తం పెట్టించింది అని తెలిస్తే పెద్దక్క చంపేస్తుందని భయంతో పంతుల్ని పంపేస్తుంది. పెళ్లి ఆగిపోవడంతో సహస్ర చాలా ఏడుస్తుంది.
పద్మాక్షి సహస్రని పెళ్లి పందిరి నుంచి రమ్మని కూతురిని భర్తని తీసుకొని వెళ్లిపోతుంది. యమున ఆదికేశవ్‌ని కలుస్తుంది. సరైన టైంకి వచ్చి పెళ్లి ఆపి మంచి పని చేశారని అంటుంది. పెళ్లి కూతురి బాధలో ఉంటుందన తనకు మీరే ధైర్యం చెప్పాలి అని ఆదికేశవ్ వెళ్లిపోతారు. వసుధ లక్ష్మీతో లక్ష్మీ ఈ పెళ్లి ఆ పైవాడికి కూడా ఇష్టం లేదేమో అందుకే మీ నాన్నతో పెళ్లి ఆపించారని విహారిని పెళ్లి పీటల మీద కూర్చొంటే నువ్వు భరించలేకపోతున్నావ్ కదా అని అంటే లక్ష్మీ ఏడుస్తుంది. వసుధని హగ్ చేసుకొని ఏడుస్తుంది.
పెళ్లి ఆగిపోవడంతో ఇంటిళ్లపాది హాల్‌లో కూర్చొని బాధ పడుతుంటారు. పద్మాక్షి లగేజ్ తీసుకొచ్చి ఇంకొక్క క్షణం ఈ ఇంట్లో ఉండను అని ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కను అని అంటుంది. నా కూతురి జీవితం నా జీవితంలా అయిపోతుందనే భయంతో వెళ్లిపోతున్నా అని ఇకపై మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. విహారి అత్తతో ఇప్పుడేమైంది అని అడుగుతాడు. పీటల మీద పెళ్లి ఆపేశారు చిన్న విషయం కాదని పద్మాక్షి బాధ పడుతుంది. ఎవరేం చెప్పినా వినను అని అంటుంది. అమ్మానాన్న మీ కూతురు చనిపోయింది అని నీరు పోసుకోండి అని చెప్తుంది. మీ కంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి సహస్రకు పెళ్లి చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది.
దాంతో సహస్ర పరుగున వెళ్లి గది తలుపు వేసుకొని ఫ్యాన్‌కి ఉరి వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. బయట నుంచి విహారి పద్మాక్షి అందరూ సహస్రని పిలుస్తారు. పద్మాక్షి ఏడుస్తుంది. అందరూ సహస్రని పిలుస్తుంటే లక్ష్మీ వెనక వైపు కిటీకి నుంచి చూసేసరికి సహస్ర ఉరి వేసుకోవడానికి రెడీ అవుతుంది. అందరూ ఇంకో ముహూర్తంలో పెళ్లి చేస్తామని బతిమాలుతారు. లక్ష్మీ విహారి వాళ్ల దగ్గరకు వెళ్లి చీరతో ఉరి వేసుకుంటుందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విహారి సహస్రని బతిమాలుతాడు. అందరూ తలుపు తీయవే అని బతిమాలుతారు. నాకు ఈ జన్మ వద్దు ఈ జీవితం వద్దని ఏడుస్తుంది.
బావ ఈ జన్మకి నీకు భార్యని కాలేకపోతున్నాను వచ్చే జన్మ ఉంటే నీకు భార్య అవుతాను అని ఉరి వేసుకుంటుంది. విలవిలా కొట్టుకుంటుంది. విహారి, మదన్‌లు తలుపు బద్దలు కొట్టి లోపలకి వెళ్తారు. విహారి సహస్ర కాలు పట్టుకుంటే మదన్ ఉరి విప్పుతాడు. తర్వాత విహారి సహస్రని కాపాడి సహస్రని కొడతాడు. సహస్ర కూలబడి ఏడుస్తుంది. అందరూ సహస్రని చూసి కన్నీరు పెట్టుకుంటారు. నీకు ఏమైనా అయితే అందరూ జీవితాంతం ఏడుస్తారని అయినా నేను నీకు పెళ్లి చేసుకోను అని చెప్పానా అని తిడతాడు. ఏదో ఆవేశంలో చేశాను అని సహస్ర అంటుంది. నీకు ఏమైనా అయితే మేం బతకలేం అని పద్మాక్షి అంటుంది. ఇక యమున సహస్రతో ఏది ఏమైనా ఏం ఆటంకం వచ్చినా ఈ సారి విహారితో నీ పెళ్లి నేను జరిపిస్తాను అని మాట ఇస్తుంది.
సహస్ర ఏడుస్తూ విహారి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని గట్టిగా ఏడుస్తుంది. బావ నన్ను క్షమించి నువ్వు దక్కవేమో అనే ఆవేశంలో ఇలా చేశాను.. ఇంకొక్క సారి ఇలా చేయను.. కానీ నేను నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని అంటుంది. నువ్వు కూడా నన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని చెప్పు బావ అని ఏడుస్తుంది. అలాగే అని విహార అంటారు. ఏడు ఏడు జన్మలకు బావే నా భర్త అని సహస్ర ఏడుస్తుంది. ఆదికేశవ్ ఇంటికి వస్తాడు. గౌరీతో పెళ్లి ఆపినందుకు బాధగా ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

