Seethe Ramudi Katnam Serial Today February 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!
Seethe Ramudi Katnam Today Episode గౌతమ్ మహా గదిలో డబ్బు తీయడంతో సీత చూసి గౌతమ్‌ని కట్టేసి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ మహాలక్ష్మీ గదిలోకి వెళ్లి బీరువాలో డబ్బు తీసుకోవాలి అనుకుంటాడు. గదిలో ఎవరూ లేకపోవడంతో బీరువా ఓపెన్ చేసి చాలా డబ్బు ఉండటంతో ఇదంతా నాదే నా ఇష్టానికి వాడుకోవచ్చు అని గెంతులేసి ప్యాకెట్ మని కోసం కొన్ని డబ్బు తీసుకుంటాడు. ఆ రోజు హనీని కొట్టానని గుర్తు చేసుకొని తనకు బంగారం గిఫ్ట్ కొని హనీతో ఎంజయ్ చేయాలని అనుకుంటాడు.
గౌతమ్ డబ్బు తీసుకొని కిందకి వెళ్తాడు. సీత డబ్బు చూసి గౌతమ్‌ని ప్రశ్నిస్తుంది. డబ్బు ఇవ్వమని అంటుంది. గౌతమ్ పారిపోబోతే సీత కాళ్లు పట్టుకొని లాగి కుర్చీలో గౌతమ్‌ని కట్టేసి డబ్బు తీసుకుంటుంది.
సీత: మర్యాదగా ఈ డబ్బు గురించి చెప్పు లేదంటే అట్లకాడ తీసుకొచ్చి వాతలు పెడతాను.
రామ్: ఏమైంది సీత ఎందుకు అతన్ని అలా కట్టేశావ్.
సీత: ఇంట్లో ఎవరూ లేని టైం చూసి డబ్బు తీసుకొని బయటకు వెళ్తున్నాడు మామ.
జనార్థన్: ఆ డబ్బు ఎక్కడి నుంచి తీశావ్ గౌతమ్.
సీత: నేను అదే అడిగాను చెప్పకపోవడంతో కట్టేశాను.
రామ్: ఎందుకు ఇలా చేశావ్ గౌతమ్.
సీత: నీతో ఇప్పుడు నిజం చెప్పిస్తా చూడు. సీత కొరడా పట్టుకొని వస్తుంది. సీత కొట్టబోయే టైంకి జనార్థన్ వద్దంటాడు. రామ్ కూడా పిన్ని వచ్చే వరకు ఆగమంటాడు. సీత గౌతమ్‌ని కొరడాతో కొడుతుంది. చెప్తావా చస్తావా అని చావగొడుతుంది. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి చూసి షాక్ అయిపోతుంది.
మహాలక్ష్మీ: ఆగు సీత ఏం జరిగింది.
అర్చన: మీ అక్క కొడుకు మన ఇంట్లో దొంగతనం చేశాడు మహా. అందుకే సీత కట్టేసి కొడుతుంది.
మహాలక్ష్మీ: కట్టేసి కొట్టడం ఏంటి గౌతమ్‌కి ఆ డబ్బు తీసుకురమ్మని నేనే చెప్పాను. నేను చెప్తేనే వీడు డబ్బుతో బయల్దేరాడు. తను ఎంత సేపటికి రాకపోవడంతో నేను వచ్చాను.
రామ్: సీత అన్ని సార్లు అడిగినా చెప్పకుండా కామ్‌గా ఉన్నావేంటి గౌతమ్.
గౌతమ్: దొంగ అనగానే నాకు కోపం వచ్చింది.
మహాలక్ష్మీ: విన్నారు కదా మీరంతా తొందరపడి మా అక్క కొడుకిని ఇబ్బంది పెట్టారు. పదరా గాయాలకు మందు రాస్తాను.
గౌతమ్: సీత ఏమనుకుంటుంది ఆఫ్ట్రాల్ 2 లక్షల కోసం నన్ను ఇలా కట్టేసి కొరడాతో కొడుతుంది.
మహాలక్ష్మీ: సీతతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. నాకు తెలీకుండా నువ్వు ఇలాంటి పనులు చేయకు.
గౌతమ్: ఈ ఆస్తి మొత్తం నీదే కదా నీ డబ్బు నాదే కదా. నా డబ్బు నేను తీసుకుంటే తనకేంటి.
మహాలక్ష్మీ: వాళ్ల దృష్టిలో నువ్వు గెస్ట్‌వి అలాగే ఉండాలి.
గౌతమ్: నాతో పెట్టుకుంటే సీతకి జాతర అయిపోతుంది. చంపేయాలి అన్నంత కోపం వస్తుంది.
మహాలక్ష్మీ: టైం వస్తుంది కాస్త ఆగు అది నన్నే ముప్పుతిప్పలు పెడుతుంది.
గౌతమ్: ఇంటికి పెద్ద నువ్వా ఆ సీతనా దానికి అంత పవర్ ఎందుకు.
సీత రావడం చూసి మాటలు మార్చేస్తారు. ఇలా కొట్టావేంటి సీత అని కోప్పడుతుంది. మీరు కవర్ చేసినట్లు ఉందని గౌతమ్ విషయంలో నాకు నమ్మకం కుదరడం లేదని తను కాస్త తేడా అనిపిస్తున్నాడని అంటుంది. గౌతమ్ తాట తీస్తా నిజాలు కక్కిస్తా అంటుంది. నన్నే బెదిరిస్తుందని గౌతమ్ అంటే అతి త్వరలో సీతకి జాతర చేద్దాం అని మహాలక్ష్మీ అంటుంది. రాత్రి అందరూ భోజనాలు చేస్తుంటారు. రామ్ పని ఒత్తిడి ఎక్కువ అయిందని చెప్తాడు. అర్చన, గిరిలు మహాలక్ష్మీని తీసుకెళ్లమని అంటారు.
మహాలక్ష్మీ గౌతమ్‌ని ఆఫీస్‌లో చేర్చాలని అనుకుంటుంది. గౌతమ్‌ని పంపిద్దామని అందరితో చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మా అక్క కొడుకే కదా బిజినెస్ అంటే వాడికి ఇష్టం అని చెప్తుంది. మన అక్క కొడుకుకి ఈ ఇంటికి సంబంధం ఏంటి అని చలపతి అడిగితే నీకు ఈ ఇంటికి కూడా సంబంధం లేదు కదా అంటుంది. గౌతమ్ నీ తమ్ముడు అని మహాలక్ష్మీ అంటే రామ్ వద్దని గౌతమ్ అప్పుడే వద్దని సీతని తీసుకెళ్తానని అంటాడు. జనార్థన్ కూడా సీతని తీసుకెళ్లమని అంటాడు. మహాలక్ష్మీ, గౌతమ్‌లు షాక్ అయిపోతారు. చేసేది ఏం లేక మహాలక్ష్మీ ఒకే అనేస్తుంది. గౌతమ్ హర్ట్ అయి భోజనం తినకుండా కడిగేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!





















