News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Guppedantha Manasu August 10 Episode 525:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కుట్రలకు చెక్ పెట్టిన రిషి వసుధార చేయందుకున్నాడు... ఆగస్టు 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఆగస్టు 10 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 10 Episode 525)

రిషి ఫోన్లో వసుధార ఫోటోలు చూస్తుండగా అక్కడకు వచ్చిన సాక్షి..ఫోన్ లాక్కుని నానా గొడవా చేస్తుంది. రిషి ఒక్కసారిగా సాక్షిపై ఫైర్ అవుతాడు. ఇంతలో దేవయాని వచ్చి సాక్షిని తీసుకెళ్లిపోతుంది. బయట జగతి,వసుధార ఎదురవుతారు. వసుని చూసి మరింత మండి పడుతుంది సాక్షి.. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావ్..ఇదంతా నీవల్లే జరుగుతోంది, నీవల్లే నా రిషి నాకు చేజారిపోతున్నాడని అరుస్తుంటుంది. ఇక్కడి నుంచి వసుధారని పంపించేయండి, ఇంట్లోకి రానివ్వకండి అంటూ అరుస్తుండగా  అప్పుడే రిషి డోర్ తీసుకుని బయటకు వస్తాడు... ఛీ అంటూ సాక్షి చిరాగ్గా వెళ్లిపోతుంది...
జగతి: సార్ నాతో చిన్న పని ఉండి వసుధార వచ్చింది
రిషి: నేనేం అడగలేదు కదా మేడం..
బాల్కనీలో నిల్చున్న వసుధార..సాక్షి మాటలు గుర్తుచేసుకుంటుంది.
వసు: మేడం నేను రిషిసార్ తో మాట్లాడతాను..
జగతి: నీకు చెబితే అర్థం కావడం లేదు..ఇది కరెక్ట్ టైం కాదు..తను మూడాఫ్ లో ఉన్నారు..ఇప్పుడెళ్లి నువ్వేం మాట్లాడతావు
వసు: ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాను..ఎందుకు సాక్షితో పెళ్లికి ఒప్పుకున్నారో సూటిగా అడిగేస్తాను. మీరు అడగరు, అడిగినా మీకు చెప్పరు
జగతి: వద్దు వసు..రిషి చాలా డిస్టబ్ అయ్యాడు..నువ్వు చూసి వెళ్లేందుకు వచ్చావ్..డిస్టబ్ చేయకు
వసు: సాక్షిని రిషి సార్ పెళ్లి చేసుకోవడం ఏంటి..ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే బాధ్యత ఉందికదా
జగతి: ఇది హక్కులు, బాధ్యతలు తేల్చుకునే సమయం కాదు..నా మాట విని సైలెంట్ గా ఉండు..
వసు: అడగను లెండి మేడం..నేను వెళుతున్నాను...
రిషి ఆలోచనల్లో మెట్లు దిగుతూ తూలి పడబోతుంటే రిషి కిందపడకుండా వసుని పట్టుకుంటాడు....
వసు: చూసుకోలేదు సార్..
రిషి: పరధ్యానం ఏంటి
వసు: పరధ్యానం ఏమీ లేదు..మీధ్యానమే ఉంది
రిషి: ఏంటి
వసు: మీకు వినిపించింది కదా మళ్లీ అడుగుతారేంటి..
ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని..సాక్షి వాళ్ల పేరెంట్స్ లగ్నపత్రిక రాయించడానికి రేపు వస్తున్నారంట.. వసుధార నువ్వు కూడా ఉంటే బావుంటుందని నా ఉద్దేశం
వసు: సరే మేడం
రిషి: సరే పెద్దమ్మా...నాకు చిన్న పని ఉంది వెళ్లొస్తాను...

Also Read: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

జగతి-మహేంద్ర కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తుంటే..నువ్విక్కడున్నావా అంటూ వస్తుంది దేవయాని. ధరణి, గౌతమ్ కూడా అక్కడకు వస్తారు. రా ధరణి అందరకీ మంచి స్వీట్ చేయి..ముఖ్యంగా జగతికి ఏ స్వీట్ కావాలో అడిగి చేయి అంటుంది.
మహేంద్ర: ఏంటి వదినా హడావుడి
దేవయాని: లగ్నపత్రిక రాయించుకోవడానికి సాక్షి పేరెంట్స్ వస్తున్నారు
మహేంద్ర: రిషి లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారు..ఈ పెళ్లి ఆపండి..
దేవయాని: ఈ పెళ్లి నేను ఆపడం ఏంటి..సాక్షితో నేను కూడా గొడవ పెట్టుకున్నాకదా..
మహేంద్ర: మీరు ఏం చెబితే అది వింటాం..రిషి జగతిని జీవితాంతం పిలవకపోయినా పర్వాలేదు..ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయండి..
దేవయాని: ఈ పెళ్లికి నాకు అసలేంటిసంబంధం...రిషి ఒప్పుకున్నాడు నేను ఓకే అన్నాను అంతే..నీకంత బాధగా ఉంటే వెళ్లి నీ కొడుక్కి చెప్పుకో..
జగతి: చాలా పండుగలకు కారణాలు ఏదో ఒక రాక్షసుల పీడ పోవడమే కారణం అని తెలుసకదా..ఏదో ఒక సందర్భంలో మనుషుల్లోంచి రాక్షసత్వం పోతుంది, పోవాలని ఆశించాలి..ఎవ్వర్నీ బతిమలాడుకోవద్దు. ఓ మంచి పని జరుగుతుందని నమ్మాలి, కోరుకోవాలి..అదే జరగకూడని పని ఉంటే అది జరగదని మనసులో గట్టిగా అనుకోవాలి
దేవయాని: మహేంద్రకి ధైర్యం చెబుతున్నావా
జగతి: వాస్తవం చెబుతున్నాను. మంచికి అన్నీ తోడవుతాయి..చెడుకి కాలం కూడా సహకరించదు. ఈ పెళ్లి జరగదు
దేవయాని: పిల్లి శాపాలకు ఉట్లు తెగవనే సామెత ఉందిలే అంటూ వెళ్లిపోతుంది...

Also Read: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు

అటు బయటకు వెళ్లిన రిషిని కలుస్తుంది వసుధార. మీతో మాట్లాడాలి అంటే..ఇందాకే కదా ఇంట్లో కలిశాంఅంటాడు
వసు: మీకు చెప్పేటంతటి దాన్ని కాదు..చెప్పే బాధ్యత నాకుంది అనుకుంటున్నా
రిషి: ఆగు అని చేయిచూపిస్తాడు..వసుధార..నువ్వేం మాట్లాడాలి అనుకున్నావో తెలుసు, నేను ఓ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తాను. దానికి సంబంధించి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు..
వసు: మీకంటూ  ఓమనసుంది..దానికి సమాధానం ఇవ్వాలి కదా..మీరు మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నారా
రిషి: నేను ఓ నిర్ణయం తీసుకున్నాను..ఇష్టం వేరు, జీవితం వేరు... నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకో.. నీ ఆశయాలు నీవి-నా ఆశయాలు నావి.. నీపై అభిమానం నాకు తగ్గదు...నాపై గౌరవం నీకు తగ్గదని నేను అనుకుంటున్నా. జరిగిన దానిగురించి ఇంకా విశ్లేషణలు అవసరం లేదన్నది నా ఫీలింగ్..
వసు: సాక్షి ఏం చేసిందో మీకు తెలుసు..అయినా కూడా సాక్షిని మీరు పెళ్లిచేసుకుంటాననడం నాకు ఇప్పటికీ అర్థంకాని విషయమే
రిషి: ఓ అడుగు వేసినప్పుడు వందసార్లు ఆలోచిస్తాం కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే వంద అడుగులు వేయాల్సి వస్తుంది. ఎవరి బలవంతంతో అయినా ఈ నిర్ణయం తీసుకున్నా అనుకుంటున్నావా...నేను కాలేజీకి ఎండీని..తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఎలా అనుకుంటున్నావ్..నా విషయంలో నేను క్లారిటీగా ఉన్నాను 
వసు: మీ మనసు తెలిసిన దానిగా మీరు వెళ్లే దారి కరెక్ట్ కాదని ఆవేదనతో అడుగుతున్నా కానీ మీపై ఎలాంటి అధికారం లేదు..
రిషి: ఈ విషయంలో అంతిమ నిర్ణయానికి వచ్చాను..నా గురించి అనవసరంగా నువ్వు బాధపడుతున్నావేమో.. కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటనలు తలుచుకో
వసు: కొన్నాళ్లుగా మీతో ప్రయాణం చేస్తున్నాను..ఈ ప్రయాణం ఇంతటితో ఆగాలనుకుంటే నేనేం చేయలేను అనుకుంటుంది మనసులో...
రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు..

Also Read:  శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

 

మహేంద్ర: సాక్షితో పెళ్లేంటి జగతి..అసలు వాడి మనసులో ఇలాంటి ఆలోచన పుట్టిందేంటని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని నాతో చర్చించేవాడు..నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు..ఇప్పుడేమైంది జగతి..కటీఫ్ చేశాడు..డాడ్ నీపై అలిగానని చెబితే నా తప్పేంటో సరిచేసుకుంటాను కదా. వసు అంటే వాడికి ఎంత ప్రేమో నాకు తెలుసు..ఇప్పుడు వసు సంగతి ఏం చేద్దామని..మాట్లాడవేంటి జగతి..
జగతి: నువ్వు అడిగిన ప్రశ్నల్లో నాక్కూడా సమాధానాలు తెలియవు..
మహేంద్ర: కొడుకు కళ్లముందు ఎదిగిపోతుంటే ఆనందపడేవాడిని కానీ ఇప్పుడు నన్ను కాదన్నంత ఎత్తుగా ఎదిగిపోయాడు..
జగతి: నా ఉనికి భరించలేని రిషి, నన్ను చూసి చిరాకుపడే రిషికి ఎదురుగా నేనిక్కడ కనిపిస్తున్నాను..నేను ఈ ఇంటికి రావడానికి నువ్వే కారణం కదా..మనిద్దరం ఒక్కటయ్యామని నీకు మానసికంగా దూరమయ్యాడేమో..
మహేంద్ర: అంటే..రిషి మనల్ని కావాలనే దూరం పెట్టాడా
జగతి: తనకు తెలియకుండా మనం దూరం అయ్యామా. తెలిసో తెలియకో మనం రిషి విషయంలో తప్పు చేశాం అని ఒప్పుకోవాలి...

Published at : 10 Aug 2022 09:47 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu august 10 Episode 525

ఇవి కూడా చూడండి

Trinayani Serial November 15th Today Episode గాయత్రీ పాపకు ప్రాణ గండం.. షాక్‌లో నయని కుటుంబం!

Trinayani Serial November 15th Today Episode గాయత్రీ పాపకు ప్రాణ గండం.. షాక్‌లో నయని కుటుంబం!

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్  - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

టాప్ స్టోరీస్

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపు

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపు

Nabha Natesh : నభా నటేష్ అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Nabha Natesh : నభా నటేష్ అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా  - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?