అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను తిట్టిన మనోహరి – భాగీని అమ్మా అని పిలిచిన బుజ్జమ్మ  

Nindu Noorella Saavasam serial Today Episode march 9th: అమర్‌ ముందే బుజ్జమ్మ, భాగీని అమ్మా అని పిలవడంతో మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, మనోహరి హాల్లో ఉండగా అప్పుడే నిద్ర లేచిన బుజ్జమ్మ రూంలోంచి వస్తూ.. భాగీని అమ్మా అమ్మా అంటూ పిలుస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. వెంటనే బుజ్జమ్మను ఆపాలని చూస్తుంది. 
మనోహరి: ( మనసులో) అరే ఈ పిల్ల నిద్రమత్తులో భాగీని అమ్మా అని పిలుస్తుంది. అమర్‌కు తెలిసిపోతుందేమో..? 
భాగీ: నేను ఇక్కడున్నాను 
బుజ్జమ్మ: అమ్మా నేను నిద్ర లేచాను నాకు పాలు కావాలి 
భాగీ: బ్రష్‌ చేశావా..?
బుజ్జమ్మ: ఇంకా లేదు బెడ్‌ మిల్క్‌ కావాలి
భాగీ: బెడ్‌ కాఫీలా..? బెడ్‌ మిల్కా..? 
మనోహరి: భాగీ, అమర్‌ హాల్లోనే ఉన్నాడు భాగీ 
రాథోడ్‌: (మనసులో) పాపం నైట్‌ జరిగింది తెలియక మనోహరి టెన్షన్‌ పడిపోతుంది
అమర్‌: నేను హాల్లో ఉంటే ఏంటి మనోహరి 
మనోహరి: అంటే అమర్‌ అది…
భాగీ హాల్లోకి వస్తుంది. 
అమర్‌: పాప పాలు అడుగుతుంది కదా ఇవ్వు 
భాగీ: పళ్లు తోముకోకుండా పాలేంటి.. బ్రష్‌ చేశాకే ఏదైనా 
అమర్: అది నీ ఇష్టం కాదు పాప ఇష్టం.. 
బుజ్జమ్మ: ఇట్స్‌ ఓకే సార్ అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాను బ్రష్‌ చేశాకే పాలు తాగుతాను.. 
భాగీ: విన్నారా… పాప నా మాటే వింటుందట. అన్నయ్యలు అక్కలు నిద్ర లేచారా..? 
బుజ్జమ్మ: వాళ్లు ఎప్పుడో నిద్ర లేచారు 
భాగీ: అంటే నువ్వు వాళ్లకంటే లేట్‌ అన్నమాట 
అమర్‌: పాప ఇష్టం వచ్చినప్పనుడు నిద్రలేస్తుంది. నీ యజమాయిషీ ఏంటి..? 
బుజ్జమ్మ: లేదు సార్‌ తప్పు నాదే కదా అమ్మనేం అనకండి 
భాగీ: గుడ్‌ గర్ల్‌ పద నీకు బ్రష్‌ చేయిస్తాను 
అంటూ బుజ్జమ్మను తీసుకుని భాగీ వెళ్లిపోతుంది. అమర్‌ కూడా వెళ్లిపోతాడు. మనోహరి మాత్రం కంగారు పడుతుంది. 
మనోహరి: రాథోడ్‌ ఆ పిల్ల తన కూతురని చెప్పేసిందా..?  అమర్‌కు తెలిసిపోయిందా..?
రాథోడ్‌:  లేదు మేం.. తెలియదు..
మనోహరి: మరి అమర్‌ ముందే ఆ పిల్ల భాగీని అమ్మా అని పిలుస్తుందే.. 
రాథోడ్‌: సారే పిలవమన్నాడు 
మనోహరి:  ఎప్పుడు చెప్పాడు 
రాథోడ్‌:  రాత్రి చెప్పారు మేడం. (రాత్రి జరిగిన విషయం చెప్తాడు.) సార్‌కు ఏమీ తెలియదు.. మీరేం కంగారు పడకండి.. మిస్సమ్మ ఏమీ చెప్పలేదు
అంటూ రాథోడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనోహరి కూల్‌ అవుతుంది. 
మనోహరి: చూశావా చంభా, భాగీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాప గురించి అమర్‌కు ఏమీ చెప్పలేదు
చంభా: కానీ పాపతో అమ్మా అనిపించుకుంటుంది కదా 
మనోహరి: తల్లి లేని పిల్ల భాగీని అమ్మా  అని పిలిస్తే తప్పేంటి చెప్పు 
చంభా: నాకు అలా అనిపించడం లేదు ఆ పాప తన పాపే అని భాగీ మెల్లగా అమరేంద్రకు చెప్పే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది
మనోహరి: అనవసరంగా భాగీని అనుమానించకు పాపం భాగీ నాకోసమే వచ్చింది. నన్ను అమర్ ను కలపడానికి వచ్చింది. 
చంభా: (మనసులో) నువ్వు అలాగే కలలు కంటూ ఆ భ్రమలోనే ఉండు.
మనోహరి: చూస్తూ ఉండు.. ఈరోజు నుంచి భాగీ తన పని మొదలు పెడుతుంది.
చంభా: ఆవిడ గారు తాను వచ్చిన పని మొదలు పెట్టి చాలా సేపు అయింది. కానీ నీకే ఇంకా అర్థం కావడం లేదు.. 
మనోహరి:  నువ్వు అంటున్నది నాకేమీ అర్థం కావడం లేదు.
చంభా: నేను చెప్పినా నీకు అర్థం కాదులే పోను పోను నీకే అర్థం అవుతుంది. భాగీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో
అని చెప్పి చంభా వెళ్లిపోతుంది. మనోహరి ఏంటో ఈ యాదమ్మ అంటూ ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget