అన్వేషించండి

Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌

Meghasandesam serial today episode march 9th: అపూర్వ, శరత్‌చంద్ర ముందే గగన్‌, భూమిల ప్రేమను మెచ్చుకుంటాడు కేపీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది. 

Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్ర ఇంట్లో అందరూ టీవీలో వార్తలు చూస్తుంటారు. అప్పుడే వాలంటైన్స్‌ డే రోజు గగన్‌ చేసిన రికార్డు గురించి వార్తల్లో వస్తుంటుంది. గగన్‌ డాన్స్‌ చేస్తూ.. భూమి బొమ్మను గీసిన చూపిస్తుంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. 
అపూర్వ: భూమిలా ఉంది..? 
నక్షత్ర: భూమిలా ఉంది కాదు.. భూమే.. 
కేపీ: అంటే భూమి బొమ్మ గీసింది నా కొడుకు అన్నమాట. అంటే ఎంత కాదనుకున్నా నిజం నిజం కాకుండా పోదు కదా..? గగన్‌ నా కొడుకేగా.. వాడు ప్రేమ చూపిస్తుంది ఎవరి మీదో కాదండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. మీ రక్తం పంచుకుని పుట్టిన మీ కూతురు భూమి మీద. అది సంతోషించే విషయమే కదా..? బావగారు గగన్‌ కోసం భూమి మిమ్మల్ని వదులుకుంది. నిజంగా అది బాధపడే విషయమే.. మిమ్మల్ని వదులుకుంది కదాని నా కొడుకు భూమిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడా అంటే అది లేదు. అసలు వాడు భూమికి దగ్గర అవుతాడా కూడా తెలియదు. ఇప్పటిదాకా భూమి ఏమైపోతుందోనని చిన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. బావగారు ఇన్నాళ్లకు భూమి ప్రేమ గెలిచింది ఇంక భూమి మీకు దగ్గర అవ్వడం ఒక్కటే మిగిలింది. 
మీరా: ఆపుతారా ఇక మీ గగన్‌ పొగడ్తల పురాణం. 
కేపీ: మీరా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను. గగన్‌ నుంచి అంత ప్రేమ దొరుకుతుంది మన ఇంటి ఆడపిల్లకే కదా..? చూడు.. ఏ మాటకు ఆ మాట. నా కొడుకు ప్రేమించినా పగ బట్టినా ఇలాగే ఉంటుంది. అందుకు ఇదే ఉదాహరణ. ఇక ఈ భూమ్మీద భూమిని, గగన్‌ను ఎవ్వరూ విడదీయలేరు. 
అని కేపీ చెప్తుండగానే.. శరత్‌ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 
అపూర్వ: తెగ మురిసిపోకు కేపీ చాలా చూశాం. భూమి, గగన్‌ ల ప్రేమ ఎన్నాళ్లు సాగుతుందో అది చూద్దాం.. 
కేపీ: బాగా మంటగా ఉన్నట్టుంది అపూర్వ… గారు.. మీరా మీ వదినకు మజ్జిగ ఇవ్వు మంట తగ్గుతుంది. భూమి, గగన్‌ లు ఇలాగే కలకాలం చల్లగా ఉండటం చూసి త్వరలోనే మీ వదిన పాపం పైకి పోతుందేమో..? 
మీరా: శివ శివ ఏంటండి ఆ మాటలు.. 
కేపీ: నేను అదే అంటున్నాను మీరా ఈ టెన్షన్‌తో మీ వదిన గారు శివుడిలో ఐక్యం అయిపోతారేమో..? 
అని చెప్తుండగానే.. సుజాత పరుగు పరుగున అమ్మాయి అమ్మాయి అనుకుంటూ బయటి నుంచి వస్తుంది. 
అపూర్వ: ఏమిటి..? 
సుజాత: అదేంటమ్మాయి అంత కోపంగా ఉన్నావేంటి..? 
కేపీ: గోరింటాకు ఒకసారి టీవీ చూడు.. 
అని చెప్పి వెళ్లిపోతాడు. సుజాత టీవీలో వస్తున్న భూమి, గగన్‌ ల న్యూస్‌ చూస్తుంది.   
సుజాత: గగన్‌ బాబు డాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు..? అంటే అబ్బే బాగాలేదు అమ్మాయి. పిడకలను కాళ్లతో కొడుతున్నట్టు ఉంది. అది సరే కానీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అలా పక్కకు రా అమ్మాయి. 
అపూర్వ: ఏంటి..? అదేంటో ఇక్కడే చెప్పు.. 
సుజాత: నలుగురిలో చెప్పేది కాదు. లోపలికి తీసుకెళ్లి ప్రైవేటుగా మాట్లాడాలి.. రా అమ్మాయి.. రా.. అంటే… 
అంటూ అపూర్వను సుజాత లోపలికి తీసుకెళ్తుంది. అపూర్వ పిన్ని ఆగు ఆగు అంటూ లోపలికి వెళ్లిపోతుంది. 

ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    
ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!  



టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget