Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!
Karthika Deepam August 10 Episode 1427: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం నిరుపమ్ పెళ్లిచుట్టూ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం ఆగస్టు 10 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam August 10 Episode 1427)
స్వప్న ఇచ్చిన లెటర్ చదివిన తర్వాత నిరుపమ్ పెళ్లి బట్టలతో బయటకు వస్తాడు. స్వప్న ఆనందానికి అవధులుండవు... నీకేం కావాలో చెప్పు నేను చూసుకుంటాను కదా అని స్వప్న తెగ హడావుడి చేసేస్తుంటుంది. నిరుపమ్ చేతిలో ఫోన్ లాక్కుని ఫ్రెండ్స్ అందరకీ కాల్స్ చేసేసి మీ ఫ్రెండ్ పెళ్లికొడుకుగా రెడీ అయి కూర్చున్నాడు మీరంతా ఎక్కడ అని అందర్నీ పిలుస్తుంది.
అటు సౌందర్య ఇంట్లో పెళ్లి సందడి మధ్య హిమ ఏడుస్తూ ఓ మూలన కూర్చుంటుంది. కంగారుగా వచ్చిన సౌందర్య.. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఏడుపెందుకని అడుగుతుంది. పెళ్లి బట్టల్లో నిరుపమ్ తో శోభ దిగిన సెల్ఫీ చూపిస్తుంది హిమ. స్వప్నత్త అన్నంత పనీ చేస్తుందని నేను అప్పటికీ చెబుతూనే ఉన్నానని ఏడుస్తుంది హిమ. అంతా అయిపోయింది నానమ్మా అని హిమ టెన్షన్ పడుతుంటే..ఇప్పుడేం చేద్దాం అని సౌందర్య, ఆనందరావు టెన్షన్ పడతారు. ఏదో ఒకలా బావని బతిమలాడి శౌర్యతో పెళ్లిచేద్దాం అనుకున్నాను ఇప్పుడేం చేద్దాం అంటుంది హిమ. ఇంతలో నటన, ఏడుపు చాలు అంటూ ఎంట్రీ ఇచ్చిన శౌర్య..ఈ మహానటిని ఏడుపు ఆపమని చెప్పండి అంటుంది.
సౌందర్య: అక్కడ వాళ్లు పెళ్లిబట్టల్లో కనిపిస్తుంటే నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావ్
శౌర్య: ఆ పెళ్లి జరగదని ఈ మహానటికి చెప్పండి..డాక్టర్ సాబ్ పెళ్లి ఈ మహానటితోనే జరుగుతుందని చెప్పండి
హిమ: నా కోసం నా పెళ్లి కోసం ఏడవడం లేదు..నీకోసం నీ పెళ్లికోసమే ఏడుస్తున్నాను
శౌర్య: ఆపు నీ డ్రామా నిన్నెప్పుడూ నమ్మను
సౌందర్య: మీ పంతాలు, మీ గొడవలే కానీ మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారే...
ఆనందరావు: సౌందర్యా ఉరుకో
సౌందర్య: ఊరుకోక ఏం చేశాను..కొడుకు, కోడలు దూరమయ్యారు, కూతురు ద్వేషం పెంచుకుంది..ఇన్నాళ్లకు మనవరాళ్లు కళ్లముందు ఉన్నారంటే వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు
శౌర్య: జరిగిన విషయాల గురించి వదిలేయండి..స్వప్నత్త అనుకున్నట్టు ఆ పెళ్లి జరగదు..నాతో రండి ఆ పెళ్లి ఎలా ఆగుతుందో తెలుస్తుంది..
Also Read: శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య
పెళ్లి కూతురు గెటప్ లో ఎంత అందంగా ఉన్నావ్ శోభ..ఇన్నాళ్లకు నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి, హాస్పిటల్ అప్పులు తీరిపోతాయి, పెళ్లయ్యాక ఆంటీ నామాటే వింటారు, నిరుపమ్ నా కొంగు పట్టుకుని తిరుగుతాడు..ఈ ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది..ఇంటి కోడలిగా చక్రం తిప్పుతాను ...జీవితంలో ఎన్నో అవమానాల పాలయ్యాను, చివరకు పెళ్లి కూతురిగా సిద్ధమయ్యాను ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అనుకుంటుంది.ఇంతలో ఓ రౌడీ వచ్చి శోభ కాళ్ల దగ్గర పడతాడు... శోభ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది...
శౌర్య: స్వప్నత్తా ఒక్కసారి రండి ..ఏంటి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారా...ఒక్కసారి వచ్చి పో...
స్వప్న: మీ అందరికీ ఇక్కడేం పని..
శౌర్య: అప్పటి నుంచీ పిలుస్తున్నాను ఇప్పుడా వచ్చేది
స్వప్న: పెళ్లింట్లో ఏంటే మీ గోల...ఇక్కడకు మిమ్మల్ని ఎవరు పిలిచారు
సౌందర్య: కోపంగా వెళ్లి స్వప్న చెంపపై లాగి కొడుతుంది...నా కోడలు అని నెత్తిన కట్టుకున్నావ్ కదా..ఏం చేసిందో చూపిద్దామనే వ్చాచను...
ప్రేమ్: అసలు వీడెవడు..శౌర్యని కిడ్నాప్ చేసినవాడు కదా...
శౌర్య: మీ మేడం ఏం చెప్పింది..మీరేం చేశారు..
రౌడీ: శోభ చెబితేనే శౌర్యని కిడ్నాప్ చేసిన విషయం బయటపెడతాడు...
నువ్వెళ్లరా అన్న స్వప్న..అవును..ఈ ఆటోదాని బాధ భరించలేక అడ్డొస్తోందని శోభ కిడ్నాప్ చేయించిందే అనుకోండి అయితే ఏంటంట..దానికే ఏదో జరిగిపోయినట్టు మీరంతా వచ్చి పెళ్లి ఆపాలని ట్రై చేస్తున్నారా...మీరెన్ని ప్రయత్నాలు చేసినా నేను ఈ పెళ్లి ఆపనంటుంది స్వప్న. ఏదో కొండను తవ్వి ఎలకను పట్టినట్టు పెళ్లిని చెడగొట్టాలని బాగానే ప్లాన్ చేశారు..ఇలాంటి వాటికి నేను భయపడను, నిరుపమ్ ను కాపాడుకోవాలని శోభ కిడ్నాప్ చేయించి ఉండొచ్చు..అక్కడ నాకు తప్పేం కనిపించలేదు నిరుపమ్ పై ప్రేమ కనిపించింది...
శౌర్య: సూపర్ స్వప్నత్తా నువ్వు..తల్లిదండ్రులను లెక్కచేయవు, మేనకోడళ్లంటే పడదు..మొగుడంటే అస్సలే పడదు.. ఎక్కడో ఉండి ఎవరో వండి పెడితే తింటుంటే అది చూసి ఓర్వలేవు...ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని వెనుకాముందూ తెలియకుండా ఉండే దీనిపై ప్రేమ చూపిస్తున్నావా...నీలాంటి విశాలమైన హృదయం ఉన్న మనిషిని ఎక్కడా చూడలేదు..
హిమ: అసలు శౌర్య గురించి నీకేం తెలుసు స్వప్నత్తా...
శౌర్య: నాగురించి పబ్లిసిటీ అవసరం లేదు..
శోభ: నువ్వు ఏదో అనుకుని ఏదో జరుగుతుందని ఆశపడి వచ్చినట్టున్నావ్...స్వప్నాంటీకి నేనంటే ఎంత నమ్మకమో అర్థం అయి ఉంటుంది కదా..ఎలా వచ్చారో అలా వెళితే బావుంటుంది.. ఆటోలో వచ్చారా , కారులో వచ్చారా మా వాళ్లకు చెప్పి డ్రాప్ చేయించమంటారా...
శౌర్య: చెప్పడం అయిపోయిందా ఇంకేమైనా మిగిలుందా...అని...చప్పట్లు కొట్టగానే..బ్యాంకు వాళ్లు ఎంట్రీ ఇస్తారు...
బ్యాంక్ ఆఫీసర్స్: మీరు లక్షలకు లక్షలు అప్పుచేశారు..అప్పు తీర్చమంటే..ధనవంతుడైన డాక్టర్ ని బుట్టలో వేశాను, వాళ్లమ్మని బుట్టలో వేసుకున్నాను పెళ్లయ్యాక ఆస్తి మొత్తం తనపేరుమీద రాయించుకుని అప్పు తీరుస్తానన్నారు...మీ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా ఉందట కదా అప్పు తీరుస్తారా లేదా...
స్వప్న: ఇదంతా నిజమా శోభా...
బ్యాంక్ ఆఫీసర్స్: నిజమా అని అడుగుతారేంటి..డాక్యుమెంట్స్ చూపించాలా
సౌందర్య: ఇంత కళ్లకు కట్టినట్టు చెప్పినా నమ్మడం లేదా...
ఆనందరావు: ఇన్నాళ్లూ గుడ్డిగా నమ్మిన విషయాన్ని ఇప్పుడు అంగీకరించాలా లేదా అని ఆలోచిస్తోంది..
శోభ: బ్యాంక్ ఆఫీసర్స్ కూడా నిజమైన వాళ్లుకాదు...
లాగిపెట్టి శోభని కొట్టిన స్వప్న బయటకు గెంటేస్తుంది...
శోభ: శౌర్యా..నీ సంగతి చూడకుండా వదిలిపెట్టను..అప్పుడే అయిపోయిందనకోకు..
ఆనందరావు: నీకన్నా జగజ్జంత్రీలను చూశాం..ఇక బయలుదేరు..
స్వప్నలో మార్పు కనిపిస్తుంది... శౌర్యను మెచ్చుకోలుగా చూస్తుంది... మరోవైపు భర్తకు కూడా సారీ చెబుతుంది. చేసిన తప్పు ఒప్పుకుంటే మనసుకి భారం తగ్గుతుంది. నా అహంకారం,మొండితనంతో అందర్నీ ఇబ్బంది పెట్టాను. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేశాను..హిమ-నిరుపమ్ పెళ్లి పనులు చురుగ్గా మొదలుపెడదాం .
సత్యం: నువ్వు ఇప్పటికైనా మారావు స్వప్నా సంతోషం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిత్య విషయంలో నా తప్పేం లేదు
Also Read: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
నిరుపమ్ వెనుకనుంచి వచ్చి కళ్లు మూస్తాడు.. మా ఫ్యామిలీకిరాబోయే పెద్ద ప్రమాదాన్ని తప్పించావ్ థ్యాంక్యూ శౌర్య అంటాడు నిరుపమ్. చెప్పడానికి మీకెలా ఉందో కానీ నాకు మాత్రం వినడానికి భారంగా ఉంది..నన్ను వదిలేస్తే ప్రశాంతంగా ఉంటానంటుంది శౌర్య.