అన్వేషించండి

Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?

Chinni Serial Today Episode March 7th:తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?

Chinni Serial Today Episode: గుడి నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నికి దారిలో ఒకతను లిప్ట్‌ అడిగితే ఇస్తుంది. కొంచెం అర్జెంట్‌ పని ఉందని మా ఆఫీసు వరకు డ్రాప్‌ చేయమని కోరగా....చిన్ని సరేనంటూ అతన్ని వాళ్ల ఆఫీసు వద్ద దించుతుంది. ఇవాళ మా ఆఫీసుకు కొత్త డిప్యూటీ సీఈవో రాబోతున్నారని అందుకే ఈ హడావుడి అంటూ చెబుతాడు. ఇప్పటి వరకు మా ఆఫీసులో ఈ పోస్టు లేదని...ఇతని కోసమే సృష్టించారని చెబుతాడు. వచ్చే అతను మా బాస్‌ కొడుకని చెప్పడంతో చిన్ని అతన్ని చూసేవరకు ఉందామని ఉంటుంది. అప్పుడే కారులో నుంచి మ్యాడీ దిగడం చూసి చిన్ని ఆశ్చర్యపోతుంది. తనపై ఉన్న కోపంతో కాలేజీకి కూడా రాకుండా మ్యాడీ ఆఫీసుకు వస్తున్నాడన్నమాట అని అనుకుంటుంది. కొత్తగా వచ్చిన డిప్యూటీ సీఈవోకు ఆఫీసులో అందరూ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటూ... అక్కడ పనిచేసే మేనేజర్‌ మధు అనే బాయ్‌ను పిలుస్తాడు. ఇతను చాలా బాగా కాఫీ, టీలు పెడతాడని చెప్పడంతో మ్యాడీకి ఆ పేరు వినగానే కోపం వస్తుంది. వెంటనే ఇతన్ని వేరే బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయమని ఆర్డర్ వేస్తాడు. నా చుట్టుపక్కల మధు, చిన్ని అనే పేర్లు అసలు వినిపించకూడదని...అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నా దగ్గరకు పంపించొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

గుడికి వెళ్లి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ల అక్కను చూసి నాగవల్లికి అనుమానం వస్తుంది. ఆపి ఏం జరిగిందని అంత ఆనందంగా ఉన్నావని నిలదీస్తుంది. ఆమె తటపటాయిస్తూ ఏం లేదని చెప్పగా...నా కళ్లల్లోకి సూటిగా చూసి చెప్పమని నిలదీస్తుంది. మ్యాడీ ఆఫీసుకు వెళ్లాడు కదా అదే ఆనందమని చెప్పగా....లేదు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే గుడి నుంచి చిన్ని వాళ్ల ఇంటికి వెళ్లి దాన్ని కలిసి వస్తున్నావు కదా అని అంటుంది. లేదు చిన్నినే గుడికి వచ్చిందని చెబుతుంది. మీరు గుడికి వెళ్తున్న విషయం నువ్వే చిన్నికి ఫోన్ చేసి చెప్పావా అని అడగ్గా...అలాంటిదేమీ లేదని తనే గుడికి వచ్చి మ్యాడీ పేరిట పూజ చేయించిందని అంటుంది. మరి అందులో అంత ఆనందపడాల్సిన విషయం ఏం ఉందని అడగ్గా...అక్కడ జరిగిన విషయం నాగవల్లికి పూసగుచ్చినట్లు వివరిస్తుంది. మ్యాడీ పడిపోబోతుంటే...చిన్ని ఆమెను పట్టుకున్న తీరు గురించి చెబుతూ...ఆ దేవుడే వారిద్దరినీ అలా కలిపాడని అనిపిస్తోందని చెబుతుంది. ఆ మాటలు విన్న నాగవల్లి కోపంగా వాళ్ల అక్క మీద అరిచి లోపలకి పంపించేస్తుంది.

ఉదయం గుడికి వెళ్లిన చిన్ని ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎంతో కంగారుపడుతుండగా చిన్ని  ఇంటికి వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని అడగ్గా...మా ఆయన ఆఫీసుకు వెళ్లానని చెబుతుంది. మ్యాడీ కాలేజీ మానేసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడని చెబుతుంది.అందుకే నేను కూడా ఏదో విధంగా ఆ కంపెనీలో జాబ్‌ సంపాధిస్తానని మ్యాడీకి దగ్గరవుతానని చిన్ని చెబుతుంది. అప్పుడే హాఫ్‌ టిక్కెట్‌...దేవా రేపటి షెడ్యూల్ వివరాలన్నీ కనుక్కుని చిన్నికి చెబుతాడు. ఆఫీసులో ప్రజలను కలిసి వినతిపత్రాలు తీసుకుంటాడని చెప్పగా....చిన్ని తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని వెతికి పెట్టాల్సిందిగా కోరుతూ దేవా ఆఫీసుకు వెళ్తుంది. 

ప్రజలందరి ముందు ఇది నన్ను ఇరికించడానికే వచ్చిందని తెలుసుకున్న దేవా ఆమెను పక్కకు వెళ్లి మాట్లాడుకుందామని తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పు మీ నాన్నను ఎవరు కిడ్నాప్ చేశారని అడగ్గా...నువ్వే మా నాన్నను కిడ్నాప్ చేశావని నాకు తెలుసని చిన్ని అంటుంది.దీంతో మినిస్టర్ దేవా అదిరిపడతాడు. ఈ సమయంలో ఏం చెప్పినా చిన్ని నమ్మదని.....మళ్లీ ఈ కేసు తిరగతోడుతుందని అనుకుంటాడు. వాళ్ల నాన్ను చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి ఇద్దరినీ ఒకేసారి చంపేస్తే అన్ని గొడవలు సర్దుకుంటాయని అనుకుంటాడు. నాగవల్లి ఇప్పుడే చిన్నిని చంపొద్దని చెప్పినా....నా రాజకీయ జీవితం బతికి ఉండాలంటే చిన్నితోపాటు వాళ్ల నాన్నను కూడా చంపక తప్పదని దేవా అనుకుంటాడు. మీ నాన్న నా దగ్గర ఓ విషయం దాచిపెట్టాడని...అందుకే అతన్ని కిడ్నాప్‌ చేసి దాచి ఉంచానని అంటాడు. అయితే మానాన్నను నాకు చూపించండని..మీకు కావాల్సిన నిజం ఆయనతో నేను చెప్పిస్తానని చిన్ని చెప్పడంతో ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు.  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget