అన్వేషించండి
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Illu Illalu Pillalu Serial Today Episode March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్
Source : Social Media
Illu Illalu Pillalu Serial Today Episode:బుజ్జమ్మ చెప్పడంతో రామరాజు చాలా రోజుల తర్వాత రైస్‌మిల్లుకు వెళ్తాడు. ఎక్కడ రైసుమిల్లు చేయిజారిపోతుందోమోనని భయపడిపోయిన శ్రీవల్లి...మొగుడికి క్యారేజీ తీసుకెళ్లే నెపంతో పరుగెత్తుకుంటూ రైస్‌మిల్లుకు వస్తుంది. ఎన్నో రోజుల తర్వాత రామరాజు రైస్‌మిల్లుకు రావడంతో తిరుపతి ఆనందానికి అవధులు ఉండవు. పెద్దకొడుకు కూడా చాలా ఆనందపడిపోతాడు. వాళ్ల నాన్నను సాదరంగా స్వాగతించి మీరు మిల్లుకు రావడమే చాలా మంచి విషయమని చెబుతాడు. మీరు ఇకపై రోజూ మిల్లుకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి కలుగజేసుకుని...అదెలా కుదురుతుందని అంటుంది. అత్తయ్యగారు ఏదో ఒకసారి చూసిరమ్మంటే వచ్చారని కానీ ఆయన ఇక్కడే ఉంటే మనసు మొత్తం పాడైపోతుందని అంటుంది.
చిన్నకూతురు పెళ్లిపీటలపై నుంచి లేచిపోయింది కదా...మీ రెండో కొడుకు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడంట కదా అని అందరూ అడిగితే ఆయన ఏం సమాధానం చెబుతారని గుర్తు చేస్తుంది. శ్రీవల్లి అన్న మాటలకు రామరాజు మనసు విరిగిపోతుంది. నిజమేరా రేపటి నుంచి అందరూ తలా ఒకమాట అంటారని... నేను రైస్‌మిల్లుకు రాలేనని అంటాడు. అయినా మీరు సమర్థవంతంగా చూసుకుంటున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానని అంటాడు. మీరు ఏం పని చేయవద్దు నాన్న.... అలా వచ్చి క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటే చాలని చెప్పినా...శ్రీవల్లి మళ్లీ ఏదో మెలిక పెడుతుంది. మానాన్న దగ్గర ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నాడు కదా...ఇప్పుడు మామయ్యగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటుంది.ఇది నిజమేనని రామరాజు అంటాడు. తిరుపతిని తీసుకెళ్లి మన షాపులన్నీ చూపించి వాడికి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో శ్రీవల్లి, వాళ్ల నాన్న చాలా సంతోషపడతారు. ఇకపై జీవితంలో మామయ్య రైస్‌మిల్లు వంక కన్నెత్తి కూడా చూడరని...ఇది మన సొంతమేనని ఆనందపడిపోతారు.
నిన్నటి వరకు ఆఫీసులో తనను ఎంతో గౌరవరంగా చూసిన తోటి సిబ్బంది ఇప్పుడు చులకన చేయడం నర్మదా తట్టుకోలేకపోతుంది. తన వెనకే తన భర్త గురించి మాట్లాడుకోవడం చూసి ఏడుస్తుంది.అక్కడ ఉండలేక మధ్యలోనే తిరిగి ఇంటికి వస్తున్న నర్మదను చూసి ప్రేమ, ధీరజ్ పలకరిస్తారు. ఏం జరిగిందని అడుగుతారు. ఆఫీసులో అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారని...ఇంట్లో కూడా అత్తయ్యగారు నేను చెప్పేది వినడం లేదని ఏడుస్తుంది. దీంతో ప్రేమ ఆమెను ఓదార్చి...నువ్వు ఏం బాధపడకు అక్కా మేం చూసుకుంటామని చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. అత్తయ్యకు అన్ని విధాలా నచ్చచెప్పి నీ మాట వినేలా చేస్తామని చెబుతారు.
తిరుపతిని తీసుకుని షాపుల వద్దకు వెళ్లి అందరికి పరిచయం చేస్తుంటాడు రామరాజు. మీ అబ్బాయి సాగర్ ఎక్కడా కనిపించడం లేదని వాళ్లు అడుగుతారు. మీరు కూడా చాలారోజులుగా రావడం లేదు ఏంటని ప్రశ్నిస్తారు.ఇంట్లో పనుల వల్ల రాలేకపోయామని..ఇక నుంచి తిరుపతి అన్ని విషయాలు చూసుకుంటాడని చెప్పి డబ్బులు తీసుకుంటాడు.అప్పుడే అక్కడికే వాళ్ల బావమరిదితోపాటు అతని చెల్లెలు కూడా వస్తారు. రామరాజు కూతురు పెళ్లిపీటలపై నుంచి లేచిపోవడంతో గుండెపోటుతో ఆస్పత్రిపాలయ్యాడని....అతని కొడుకు లంచంతో ఉద్యోగం కొనుక్కున్నాడని ఇలాంటి వాడి గురించి నువ్వు గొప్పలు చెబుతున్నావేంటని దుకాణం అతనితో అంటారు.కావాలనే రామరాజు పరువు తీసేందుకు ప్రయత్నించడంతో రామరాజు చాలా బాధపడతాడు. వెంటనే తిరుపతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రైస్‌మిల్లు తమ సొంతమైందని ఆనందంతో గెంతులు వేసుకుంటూ ఇంటికి చేరిన శ్రీవల్లిని బుజ్జమ్మ అడుగుతుంది. మామయ్యగారు రైస్‌మిల్లులో ఎలా ఉన్నారని అడగ్గా...చాలా సంతోషంగా ఉన్నారని అబద్ధం చెబుతుంది.అప్పుడే నర్మదా ఇంటికి రాగా...బుజ్జమ్మ కస్సుబుస్సుమంటుంది. వాళ్లిద్దరినీ దగ్గర చేయడానికి ప్రేమ, ధీరజ్ ఓ మంచి ఉపాయం వేస్తారు.
ఇంకా చదవండి
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















