By: ABP Desam | Updated at : 09 Aug 2022 09:03 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu August 9 Episode 524 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు ఆగస్టు 9 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 9 Episode 524)
దేవయాని డ్రామాకు కరిగిపోయిన రిషి.. సాక్షిని పెళ్లిచేసుకుంటానని షాకిచ్చాడు. ఆ విషయం మొత్తాన్ని జగతి..వసుధారకి కాల్ చేసి చేబుతుంది. రెస్టారెంట్లో రిషికోసం ఎదురుచూస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ రెస్టారెంట్లో ప్రారంభమైంది.
రిషి-వసు
ఇద్దరూ రెస్టారెంట్ లో కూర్చుని ఒకరి వైపు ఒకటి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో రిషి ఏంటి అలా ఉన్నావని అడుగుతాడు.
వసు: నాకు చాలా మాట్లాడాలని ఉంది సార్ కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు
రిషి: పర్లేదు చెప్పు
వసు: మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది. మీరిలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు..
రిషి: మనం చాలా అనుకుంటాం వసుధార అన్నీ జరగవు కదా... నేను మాట్లాడేది కాఫీ గురించి.. కాఫీ తాగుదామని వచ్చాను కానీ ఎందుకోకాఫీ తాగాలని లేదు...
వసు: మీకింక ఎలా చెప్పాలి..మీరు సాక్షిని పెళ్లిచేసుకోవడం ఏంటి..నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు..
రెస్టారెంట్ నుంచి ఇంటికెళ్లిన రిషి..బాల్కనీలో నిలబడి ఆళోచిస్తుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన సాక్షి.. థ్యాంక్యూ పెళ్లికి ఒప్పుకున్నందుకు అంటుంది. నీ పేరులో మొదటి అక్షరం 'R' రింగ్ చేయిస్తున్నా..నువ్వు 'S' అని చేయించు అంటుంది. నువ్వు చేయించినప్పుడు నేను చేయించకుండా ఎలా ఉంటాను చేయిస్తానులే అంటాడు. షాపింగ్ కి వెళదాం పద అని సాక్షి అంటే.. రిషి అదంతా తలనొప్పి వ్యవహారం అంటాడు.
సాక్షి: రిషి నీకు షాపింగ్ నచ్చదా..(వసుకి తెచ్చిన బట్టల విషయం గుర్తుచేసుకుంటుంది) మళ్లీ గట్టిగా మాట్లాడుతుంది.
రిషి: ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవడం ఓ గొప్ప కళ..అది నీకు అర్థం కాదులే అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. జగతి ఎంట్రీ ఇస్తుంది..
సాక్షి: ఏంటి ఆంటీ అలా చూస్తున్నారు
జగతి: కొన్ని చూడకూడనివి కూడా జీవితంలో అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది..జరగకూడనివి కూడా జరుగుతూ ఉంటాయి..
అటు రూమ్ కి వెళ్లిన రిషి..వసు జ్ఞాపకాలను చూస్తూ బాధపడుతుంటాడు. తండ్రి మహేంద్ర రావడం చూసి గోళీల బాటిల్ వెనక్కు దాచేస్తాడు.
మహేంద్ర: నీతో కొంచెం మాట్లాడాలి రిషి
రిషి: చెప్పండి డాడీ
మహేంద్ర: మనిద్దరం ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళం. ఇప్పుడెందుకో మనమధ్య ఆ స్నేహం లేదని నా మనసు చెబుతోంది.
రిషి: అలా ఎలా డిసైడ్ చేస్తారు
మహేంద్ర: ఒకే ఇంట్లో ఉన్నా దూరమైపోయాం..నా స్నేహానికి రెక్కలొచ్చి ఎగిరిపోయింది
రిషి: సూటిగా చెప్పండిడాడ్
మహేంద్ర: నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి..నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్ ఎందుకు.. ఒకప్పుడు సాక్షి పేరు వింటేనే చిరాకుపడేవాడివి..
రిషి: ఎవరికైనా భయపడుతున్నానని మీరు అనుకుంటున్నారా
మహేంద్ర: పోనీ ఏమైందో నువ్వేచెప్పు..ఇది నేను ఊహించలేకపోతున్నాను
రిషి: మీరు ఊహించినది జరగనంత మాత్రాన అది తప్పుడు నిర్ణయం అవుతుందా సార్...
మహేంద్ర: నువ్వేటో నీ మనసేంటో నీ కన్నా బాగా నాకే తెలుసు...వసుధార గురించి ఆలోచించావా.. పాపం తను.. పెళ్లి పీటలమీదనుంచి పారిపోయి వచ్చింది. తన జీవితం , లక్ష్యం కోసం కష్టపడుతోంది..
రిషి: నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను..ఇందులో ఎవ్వరి బలవంతం లేదు..అవసరానికి మించి ఆలోచించి మీరు టెన్షన్ పడకండి..
మహేంద్ర: చాలా చెప్పాలని ఎన్నో అడగాలని వచ్చాను..ఏమీ అడగలేక వెళుతున్నాను..నీ ఇష్టం రిషి...
నన్ను నేను గెలిపించుకోవాలంటే నా ప్రేమ గెలవాలంటే నాకు నేను పెట్టుకున్న కఠినమైన పరీక్ష ఇది అనుకుంటారు రిషి మనసులో...
వసుధార
అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనేం అడిగాను నువ్వేం చేస్తున్నావ్.. రిషి సార్ మనసులో ఏముంది..ఆయన మాటలకు అర్థం ఇదా..నన్ను పట్టించుకోకుండా ఉన్నారంటే తనని మర్చిపోమని చెబుతున్నారా, తను నన్ను మర్చిపోమని చెబుతున్నారా..నాకేం అర్థం కాలేదు. ఆ సాక్షితో రిషి సార్ జీవితాంతం ఎలా నడుస్తారు. ఇష్టం లేని వ్యక్తిని పదినిముషాలు కూడా భరించలేరు కదా.. ఇది రిషి సార్ నాకు పెట్టిన పరీక్షా..నువ్వు నాకు పెట్టిన పరీక్షా.. నేను ఈ పరీక్షను ఎదుర్కొంటాను. శక్తివంచన లేకుండా మనస్ఫూర్తిగా ఈ పరీక్షను ఎదుర్కొంటాను. ఇందులో ఎలా గెలవాలో నాకు తెలుసు. రిషిసార్ మనసు ఎలా గెలవాలో నాకు తెలుసమ్మా అని నమస్కారం చేసుకుంటుంది...
దేవయాని-సాక్షి
దేవయాని సాక్షితో నీ కోరిక తీరింది కదా అంటే..సాక్షి మాత్రం రిషి తనతో సరిగా మాట్లాడటం లేదంటుంది. ప్రస్తుతానికి రిషి మనసులో స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేయి అంటుంది. ఆ తర్వాత రిషి ఫోన్లో వసుధార ఫోటోలు చూస్తుండగా అక్కడకు వచ్చిన సాక్షి..రిషఇ ఫోన్ లాక్కుని నానా గొడవా చేస్తుంది. రిషి ఒక్కసారిగా సాక్షిపై ఫైర్ అవుతాడు. ఇంతలో దేవయాని వచ్చి సాక్షిని తీసుకెళ్లిపోతుంది. బయట జగతి,వసుధార ఎదురవుతారు. వసుని చూసి మరింత మండి పడుతుంది సాక్షి.. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావ్..ఇదంతా నీవల్లే జరుగుతోందంటూ అరుస్తుంటుంది. అప్పుడే రిషి అక్కడకు వస్తాడు...
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్లో రుద్రాణికి చుక్కలే!
Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>