అన్వేషించండి
Advertisement
Sumanth's Malli Modalaindi: విడాకుల వేడిని క్యాష్ చేసుకుంటున్న సుమంత్ అండ్...
విడాకులు... విడాకులు... విడాకులు... ఇప్పుడు ఎటు చూసినా విడాకుల వార్తలే. ఈ వేడిని సుమంత్ క్యాష్ చేసుకుంటాడా?
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ధనుష్ ఈమధ్యే విడాకులు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. చిరంజీవి కుమార్తె శ్రీజ, హీరో కళ్యాణ్ దేవ్ కూడా విడాకులు తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు చివర కళ్యాణ్ పేరును తీసేసిన శ్రీజ, కొణిదెల అని రాసుకున్నారు. ఇప్పుడు ఎటు చూసినా విడాకుల విషయాలే. ఈ వేడిని సుమంత్ అండ్ జీ 5 టీమ్ క్యాష్ చేసుకుంటోంది.
విడాకుల తర్వాత తన కేసును వాదించిన లాయర్‌తో ఓ మగాడు ప్రేమలో పడితే... విడాకుల తర్వాత అతని జీవితం ఎలా ఉంది? అనే కథతో రూపొందిన సినిమా 'మళ్ళీ మొదలైంది'. సుమంత్ హీరోగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్‌లో విడాకులు తీసుకున్న నికోల్ కిడ్‌మన్ - టామ్ క్రూజ్, బిల్ గేట్స్ - మిళిందా గేట్స్, బ్రాడ్ పిట్ - ఏంజెలీనా జోలి ఫొటోలు వేశారు. ఇప్పుడు అయితే ఇండియన్ సెలబ్రిటీ కపుల్స్ ఫోటోలు వేసేవారు ఏమో! అది పక్కన పెడితే... ఈ విడాకుల వేడిలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
'మళ్ళీ మొదలైంది' సినిమా ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ రైట్స్‌ను 'జీ 5' దక్కించుకుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బయట హీరోలు విడాకులు తీసుకున్న విషయాలపై వేడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో విడాకుల తర్వాత కూడా జీవితం ఉందని చెప్పే కథతో రూపొందిన సినిమాను విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని సుమంత్ అండ్ టీమ్ భావిస్తున్నట్టు ఉంది. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సుమంత్ భార్యగా వర్షిణి, న్యాయవాదిగా నైనా గంగూలీ నటించారు. సినిమా విడుదల అయితే ఎలా ఉందో తెలుస్తుంది.
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion