By: ABP Desam | Updated at : 17 Jan 2022 07:54 PM (IST)
కుమార్తెలతో కళ్యాణ్ దేవ్, శ్రీజ
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ సర్కిల్స్, ఆడియన్స్, మెగా అభిమానుల్లో హాట్ డిస్కషన్. దీనికి కారణం... ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు చివర భర్త కళ్యాణ్ పేరును శ్రీజ తొలగించడమే. సాధారణంగా తన పేరును 'శ్రీజ కళ్యాణ్' అని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాసుకునేవారు. ఇప్పుడు 'కళ్యాణ్'ను తొలగించి కేవలం శ్రీజ అని మాత్రమే రాశారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 'శ్రీజ కొణిదెల' అని రాశారు. దాంతో సందేహాలు మొదలు అయ్యాయి.
గత ఏడాది కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతులు విడిపోతారని వదంతులు షికారు చేశాయి. మెగా ఫ్యామిలీ వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదని కొందరు కామెంట్లు చేశారు. శ్రీజ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కళ్యాణ్ దేవ్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అప్పుడు పుకార్లకు చెక్ పడింది. అయితే... ఆ పోస్ట్ గమనిస్తే... ఆయన 'శ్రీజ కళ్యాణ్' ఇన్‌స్టా హ్యాండిల్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే... పేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. శ్రీజ కొణిదెల పేరుతో ఆమె ఇన్‌స్టా హ్యాండిల్ ఉంది. ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతల్లో లైఫ్ పార్ట్‌నర్‌తో దిగిన ఫొటోలు ఉన్నాయి. డిలీట్ చేయలేదు. దాంతో జనాల్లో ఉన్నది కేవలం డౌట్స్ మాత్రమే అనుకోవాలి. అధికారికంగా దంతపతులిద్దరూ ఏమీ చెప్పలేదు కాబట్టి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.
నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు సమంత కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో తన పేరును సమంత అక్కినేని నుంచి సమంతగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇలా పేరు మార్చుకున్నంత మాత్రానా... విడిపోతారని కాదు. ప్రియాంకా చోప్రా కూడా తన పేరు చివర, జోనాస్ తీసేశారు. అలాగని, ఆమె విడిపోలేదు కదా! అయితే... సగటు ప్రేక్షకులు, మెగా అభిమానుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతోంది.
శ్రీజతో వివాహమైన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. 'విజేత', 'సూపర్ మచ్చి' సినిమాలు చేశారు. 'కిన్నెరసాని' త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. 'సూపర్ మచ్చి' సినిమా ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ పాల్గొనలేదు. ఆ మాటకు వస్తే... కళ్యాణ్ దేవ్ కూడా ఆ సినిమాను ప్రమోట్ చేయలేదు.
Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
Also Read: రామ్ క్యారెక్టర్, ఫస్ట్‌లుక్ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nandamuri Chaitanya Krishna: వెండితెరకు మరో నందమూరి వారసుడు, చైతన్య కృష్ణ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య
Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్ స్ట్రోక్
Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Khammam Politics: పాలేరులో గుచ్చే గులాబీ ముళ్లు- పోటీ పక్కా అంటున్న తుమ్మల, మరి కందాల పరిస్థితి ఏంటి..?
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!