Bangarraju in Rajasthan: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
'బంగార్రాజు' సినిమా రాజస్తాన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ రిలీజ్ నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆయన చెప్పినది వింటే ఆడియన్స్ కూడా సర్‌ప్రైజ్ అవుతారు.
కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు'. సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు బావున్నాయని సినిమా యూనిట్ ప్రకటించింది. మూడు రోజుల్లో సినిమా రూ. 53 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని టీమ్ తెలిపింది. అంత వరకూ ఓకే. నాగార్జున కూడా ఫుల్ హ్యాపీ. అయితే... ఆయన కూడా సర్‌ప్రైజ్ అయిన విషయం ఒకటుంది. అదేంటో తెలుసా? రాజస్తాన్‌లో 'బంగార్రాజు' రిలీజ్. అవును... పక్కా పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో, గోదావరి యాసతో రూపొందిన 'బంగార్రాజు' సినిమా రాజస్తాన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ విషయం నాగార్జునే స్వయంగా చెప్పారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'జీ 5' ఓటీటీ ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2' ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున, ఇప్పుడు ప్రేక్షకుల మధ్య భాషాబేధం లేదని చెప్పారు. ప్రపంచం చిన్నదైపోయిందన్నారు. మనీ హెయిస్ట్, స్క్విడ్ గేమ్ - కంటెంట్ బావుంటే... భాషతో సంబంధం లేకుండా చూస్తున్నారని చెప్పారు. తెలుగు సినిమాలు కూడా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాయని ఆయన అన్నారు.
ఇంకా నాగార్జున మాట్లాడుతూ "మొన్న నేను సర్‌ప్రైజ్ అయ్యాను. 'బంగార్రాజు' ప్రింట్స్ 22 కావాలని రాజస్తాన్ వాళ్లు అడిగారు. ఎందుకు అడిగారో నాకు తెలియదు. హిందీలో కూడా డబ్ చేయలేదు. 22 డిస్క్‌లు పంపించాను. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో. వాళ్లు తీసుకున్నారు. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది బేరియర్ కాదు" అని అన్నారు. ఫారిన్ లాంగ్వేజెస్‌లో కూడా 'లూజర్ 2' చూస్తారని ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. 'లూజర్ 2' క్రెడిట్ మొత్తం సుప్రియదే అన్నారు.
View this post on Instagram
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: రామ్ క్యారెక్టర్, ఫస్ట్‌లుక్ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి