అన్వేషించండి
Pushpa Craze Effect: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
హిందీలో అల్లు అర్జున్ 'పుష్ప'కు మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో ఆయన హీరోగా నటించిన మరో సినిమాను హిందీకి తీసుకు వెళుతున్నారు.
![Pushpa Craze Effect: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!! Allu Arjun's Ala Vaikunthapurramuloo Hindi dubbing version will release across Indian cinemas on 26th Jan, 2022 Pushpa Craze Effect: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/ca2f2b745ea0a4b649ad1c1ac82b8753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అల్లు అర్జున్, పూజా హెగ్డే
తెలుగులో తమిళ్ హీరోలు లేదంటే కన్నడ హీరోలు నటించిన సినిమాలు మంచి విజయం సాధిస్తే... ఆ తర్వాత ఆయా హీరోలు నటించిన పాత సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అల్లు అర్జున్ విషయంలో హిందీ నిర్మాతలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. 'పుష్ప'తో ఐకాన్ స్టార్ హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో, ఇప్పుడు అల్లు అర్జున్ లాస్ట్ సినిమా 'అల... వైకుంఠపురములో' సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా 'అల... వైకుంఠపురములో'. సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2020లో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గోల్డ్ మైన్స్, ఏఏ ఫిల్మ్స్ అనౌన్స్ చేశాయి.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే... 'అల వైకుంఠంపురములో' సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పాత్రలో కార్తీక్ ఆర్యన్, పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. బహుశా... డబ్బింగ్ వెర్షన్ విడుదలైనా సరే రీమేక్‌కు ఎటువంటి నష్టం ఉండదని భావించారేమో!!ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI
— taran adarsh (@taran_adarsh) January 17, 2022
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion