Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్ - ఓవర్సీస్‌లో ప్రీ సేల్ కలెక్షన్స్ ఎంతంటే?
Ustaad Bhagat Singh Collection : పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీ సేల్స్ ఓవర్సీస్‌లో అదరగొడుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Pre Sales Collections : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి.
ప్రీ సేల్స్ కలెక్షన్స్ ఎంతంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో అదరగొడుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే దాదాపు 5 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ దాదాపు $115 (రూ.కోటికి పైగా) వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న సినిమా రిలీజ్ కానుండగా... రాబోయే రోజుల్లో ఈ సేల్స్ మరింత పెరగొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అవి ప్రారంభమైతే పవర్ స్టార్ మూవీ మోత మోగిపోతుందని అంటున్నారు.
Also Read : విశ్వంభర VFXపై ట్రోల్స్ - అసలు తప్పెవరిది? సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు రియాక్షన్
బిగ్ ఓటీటీ డీల్
పవర్ స్టార్, హరీష్ శంకర్ కాంబో క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ డిజిటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' దాదాపు 80 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో సేల్ కావడం ఇదే ఫస్ట్ టైం అని తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన వింటేజ్ పవర్ స్టార్ లుక్స్ సాంగ్స్, ట్రైలర్ టీజ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దేఖ్ లేంగే సాలా సాంగ్ దగ్గర నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ వరకూ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 'భగత్ గీతను దమ్మున్నోడు దాటొచ్చు' అంటూ ట్రైలర్ టీజ్‌లో పవన్ చెప్పిన డైలాగ్ వేరే లెవల్. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెన్సార్ రిపోర్ట్
ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఫ్యామిలీతో వచ్చి మూవీ ఎంజాయ్ చెయ్యొచ్చంటూ మేకర్స్ అపీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతుందోననే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా...
ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజీఎం అందిస్తున్నారు. పవన్ డబ్బింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.
మూవీలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. విలన్ రోల్‌లో తమిళ నటుడు పార్తిబన్ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గతంలో పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు క్రియేట్ చేయగా ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























