Janhvi Kapoor: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
జాన్వీకపూర్ జోరు పెంచింది. ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సెలెబ్రిటీ కిడ్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ చాలా తక్కువ కాలంలోనే సొంత గుర్తింపును సంపాదించుకుంది. వరుసపెట్టి సినిమాలు చేయడంతో పాటూ వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తూ అభిమానులను పెంచుకుంటోంది. ఆమె ఇన్స్‌స్టా గ్రామ్‌లో కోటిన్నరమంది ఫాలోవర్లున్నారు. వారి కోసం ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది జాన్వీ. మొన్నీ మధ్య పింక్ రంగు వన్ షోల్డర్ బికినీలో సెగలు రేపింది. వన్ పీస్ స్విమ్ వేర్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 19,500 రూపాయలు. ఆ బికినీ కుట్టడానికి రెండు మీటర్ల క్లాత్ వాడారో లేదో తెలియదు కానీ, ధర మాత్రం కళ్లు చెదిరేలా ఉంది. ఆ బికినీ ఆన్ లైన్లో కూడా అమ్మకానికి ఉంది.
జాన్వీ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. త్వరలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’లో కూడా నటించనుంది. అలాగే జాన్వీ సిద్ధార్ద్ సేన్ గుప్తా తీస్తున్న గుడ్ లక్ జెర్రీ’లో కూడా నటించనుంది. ‘మిల్లి’ అనే సినిమా కోసం తండ్రితో కలిసి పనిచేయబోతోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి