Dhanush Helps Soundarya: రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధనుష్ చేసిన సాయం ఇదే!
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ ఇప్పుడు విడిపోయారు. కానీ, కలిసున్నప్పుడు రజనీ రెండో కుమార్తె పెళ్లికి ధనుష్ ఓ సాయం చేశారు. అదేంటో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య విడాకుల ప్రకటన వచ్చిన వెంటనే... కొంత మంది రెండో కుమార్తె సౌందర్య ప్రస్తావన తీసుకు వచ్చారు. గతంలో ఆమె కూడా విడాకులు తీసుకోవడమే అందుకు కారణం. సౌందర్యా రజనీకాంత్‌కు అశ్విన్ రామ్‌కుమార్ అనే వ్యాపారవేత్తతో 2010లో వివాహం అయ్యింది. ఏడేళ్ల తర్వాత పరస్ఫర అంగీకారంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. వారికి ఓ కుమారుడు వేద్ ఉన్నారు. విడాకులు తీసుకున్న రెండేళ్లకు సౌందర్య మరో వివాహం చేసుకున్నారు. తమిళ నటుడు, వ్యాపారవేత్త విశాగణ్ వనంగమూడితో ఏడడుగులు నడిచారు. అప్పట్లో వారిద్దరి పెళ్లి రిసెప్షన్‌కు ధనుష్ రాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే... ఆ పెళ్లికి ధనుష్ చేసిన సాయం కూడా ఉంది.
విశాగణ్, సౌందర్య వివాహం చేసుకోవాలని అనుకున్న తర్వాత తొలుత రజనీకాంత్‌ను కలవలేదు. ధనుష్, సౌందర్య దంపతులను (అప్పటికి విడాకులు తీసుకోలేదు) కలిశారు. పెళ్లికి ముందు అక్కాబావను కలవమని విశాగణ్‌కు సౌందర్య చెప్పారు. విశాగణ్ కూడా ధనుష్‌ను కలిసి "రజనీకాంత్ ఏమంటారో?" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అప్పుడు అతడికి "ఏం కాదు. అంతా బావుంటుంది" అని ధైర్యం చెప్పారట. ఓ సందర్భంలో ధనుష్ దగ్గర ఈ విషయం ప్రస్తావించగా... "ఏ కుటుంబంలో అయినా ఇదే విధంగా జరుగుతుందని అనుకుంటున్నాను. అదొక ఫ్యామిలీ మీటింగ్. విశాగణ్ తన నిర్ణయం చెప్పినప్పుడు అంతా బావుంటుందని చెప్పాను. అంతే కానీ... భయపెట్టలేం కదా! పెద్దాయన్ను (రజనీకాంత్‌ను) కలిసేటప్పుడు కొంత భయం ఉంటుంది కదా! ఆయన చాలా కూల్ పర్సన్. కామ్‌గా ఉండు. అంతా బావుంటుందని చెప్పాను" అని ధనుష్ వివరించారు. అప్పుడు ఇంటికి పెద్ద అల్లుడిగా ధనుష్ చేసిన సాయం అదే.
చెల్లెలు సౌందర్యలా ఐశ్యర్య కూడా మరో వివాహం చేసుకుంటారా? ఒంటరిగా ఉంటారా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. ధనుష్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు కుమారులు యాత్ర రాజా, లింగ రాజా ఉన్నారు. పిల్లలు అంటే ఇద్దరికీ ప్రాణమే.
Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది..
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















