Dhanush - Self Made Star: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
ఇప్పుడూ ధనుష్‌ను రజనీకాంత్- అల్లుడు అంటారా? అతడికి రజని అండ అవసరమా? లేదా? ఆ ట్యాగ్ నుంచి అతడు బయటకు వచ్చాడా? లేదా?
ధనుష్... సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా వచ్చారు. ఆయన తండ్రి కస్తూరి రాజా దర్శకుడు. తమిళంలో సినిమాలు చేశారు. ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ కూడా దర్శకుడే. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన 'ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే' సినిమాకు దర్శకత్వం వహించింది ఆయనే. 'యుగానికి ఒక్కడు', '7/జి బృందావన కాలనీ' వంటి విజయవంతమైన చిత్రాలకూ అతడే దర్శకుడు. ధనుష్ తండ్రి, అన్నయ్య దర్శకులు అయినప్పటికీ... రజనీకాంత్ అల్లుడిగా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది ఆయన్ను చూశారు.
అవును... ధనుష్ అంటే కొందరు రజనీకాంత్ అల్లుడిగా గుర్తు పడతారు. దీనికి కారణం... రజనీకాంత్ సూపర్ స్టార్ కావడం ఒకటి. ధనుష్ తండ్రి, అన్నయ్య తెర వెనుక ఉండటం మరొకటి అని చెప్పవచ్చు. ఒకవేళ ధనుష్ దర్శకుడు అయితే అతడిని కస్తూరి రాజా కుమారుడు అనో, సెల్వ రాఘవన్ తమ్ముడు అనో అనేవారు ఏమో!? తండ్రి, అన్నయ్య బాటలో మెగాఫోన్ పెట్టుకున్నాడని చెప్పేవారేమో!? ఆ ఛాన్స్ ధనుష్ ఇవ్వలేదు. యాక్టింగ్ వైపు వచ్చారు. ఆల్రెడీ మామ సూపర్ స్టార్ కావడంతో ధనుష్‌ను రజని అల్లుడు అనడం మొదలు పెట్టారు. అసలు, రజని అల్లుడు కావడానికి ముందే హీరోగా విజయాలు అందుకున్నారు ధనుష్.
ధనుష్ హీరో అవ్వడానికి కారణం తండ్రి, అన్నయ్య అని చెప్పాలి. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ వల్ల సెల్వ రాఘవన్ సినిమాకు హీరో దొరక్కపోతే... ధనుష్‌ను హీరో చేశారు కస్తూరి రాజా. ఆ సినిమా పేరు 'తుళ్లువదో ఇలమై'. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసినా... బిజినెస్ బాగా జరగడం కోసం దర్శకుడిగా కస్తూరి రాజా పేరు వేశారు. ఆ సినిమా 2002లో విడుదలైంది. అప్పటికి ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకోలేదు. హీరోగా తొలి సినిమా హిట్ అయినా... కొంతమంది బి గ్రేడ్ సినిమా అని కామెంట్ చేశారు. ఐశ్వర్యతో పెళ్లికి ముందే... అన్నయ్య దర్శకత్వంలో మరో సినిమా చేసి హిట్ అందుకున్నారు.
ఐశ్వర్యతో పెళ్లికి ముందూ, తర్వాత హీరోగా ధనుష్ విజయాలు అందుకున్నారు. అయితే... ఏనాడూ రజనీకాంత్ క్రేజ్ వాడుకోవాలని చూడలేదు. ఇంకా నిజాయతీగా చెప్పాలంటే... ధనుష్ హీరోగా అతడి అన్న సెల్వ రాఘవన్ చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. అయితే... తమిళనాట రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అతడి మీద అల్లుడు అనే ముద్ర వేసింది. సినిమాలో సిగరెట్ కాలిస్తే... రజనీలా కాల్చాడని, స్టయిలుగా చేస్తే రజనీలా చేశాడని... ధనుష్ ఏం చేసినా, ఫలానా సినిమాలో రజనీకాంత్ చేసినట్టు చేశాడని అభిమానులు ఉప్పొంగిపోవడం మొదలుపెట్టారు. దీనికి ధనుష్ ఇబ్బంది పడలేదు. పైగా, కోప్పడనూ లేదు. ఎప్పుడూ పెదవి మీద చిరునవ్వు కోల్పోలేదు. తన నటనతో సమాధానం చెప్పారు.
Also Read: ధనుష్.. ఐశ్వర్య కంటే చిన్నోడు, హడావిడిగా పెళ్లి.. వీరిది చాలా చిత్రమైన ప్రేమ!
రజని అల్లుడు ట్యాగ్ లైన్ అతడికి ఎంత హెల్ప్ అయ్యిందనేది పక్కన పెడితే... అతడిలో నటుడు మాత్రం చాలా హెల్ప్ అయ్యాడు. రజని అల్లుడు ట్యాగ్ నుంచి ఆయన ఎప్పుడో బయటకు వచ్చారు. బయటకు రావడానికి ఎప్పటి నుంచో బాటలు వేసుకున్నారు. కేవలం తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా... ఇతర భాషల మీద దృష్టి పెట్టారు. రజనీకాంత్ అల్లుడు అవ్వడం వల్లనే ధనుష్‌కు సినిమాలు వచ్చి ఉంటే... అతడిని బాలీవుడ్ తీసుకువెళ్లేది కాదు. హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చేవి కాదు. జాతీయ పురస్కారాలు వరించేవి కావు.
రజనీకాంత్‌ది మాస్ కమర్షియల్ ఇమేజ్. ఆయన్ను నటుడిగా కంటే స్టార్‌గా ఎక్కువ మంది చూశారు. రజనీ రూటులో వెళుతూ... ధనుష్ మాస్ కమర్షియల్ సినిమాలే చేయలేదు. నటుడిగా ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. 'అసురన్' సినిమాలో ఇద్దరి పిల్లల తండ్రిగా చేయడానికి వెనుకాడలేదు. అదే ధనుష్ హిందీ సినిమా 'రంఝనా'లో కొన్ని సన్నివేశాల్లో స్కూల్ యూనిఫామ్‌లోనూ కనిపించారు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం మొదలు పెట్టారు. అదే అతడికి అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ధనుష్, రజనీకాంత్ అల్లుడు కాదు. ఆ మాటకు వస్తే... కథలు, సినిమాల ఎంపికలో ఎప్పుడూ కాదు. ధనుష్ ఓ సెల్ఫ్ మేడ్ స్టార్. స్టార్ కంటే ముందు యాక్టర్.
Also Read: ధనుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వర్యా రజనీకాంత్ ప్రేమలో ఉందా?
ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌తో తాను చేయబోయే స్క్రిప్ట్స్ గురించి డిస్కస్ చేయనని ధనుష్ చెప్పారు. ఒకవేళ ఆయన ఆ మాట చెప్పకపోయినా... ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే మనమే చెప్పవచ్చు. ఏమంటారు?
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: హీరోగా సప్తగిరి... మాస్ చిత్రాల దర్శకుడితో కొత్త సినిమా!
Also Read: కీర్తీ సురేష్‌కు కరోనా తగ్గింది. అయితే... ముఖంలో ఆ మార్పు గమనించారా?
Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి