Dhanush Aishwarya Love Story: ధనుష్.. ఐశ్వర్య కంటే చిన్నోడు, హడావిడిగా పెళ్లి.. వీరిది చాలా చిత్రమైన ప్రేమ!

ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ భలే చిత్రంగా మొదలైంది. థియేటర్లో కలిసిన వారిద్దరూ 2 ఏళ్లు గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేశారు. ధనుష్ ఆమె కంటే చిన్నోడని తెలిసినా.. రజినీకాంత్ వారికి పెళ్లికి చేయక తప్పలేదు.

FOLLOW US: 

నుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా తనయుడు. ధనుష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇతడు హీరోనా.. చూస్తే కేజీ కండలేదంటూ ఎగతాళి చేసినవాళ్లు కూడా ఉన్నారు. కానీ, 2002లో తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తుల్లువదో ఇలామై’ చిత్రం హిట్‌తో అందరి నోళ్లు మూయించాడు. మొదటి చిత్రంతోనే ధనుష్ హిట్ కొట్టినా.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు పనికిరాడనే టాక్ వినిపించింది. అప్పుడే 2003లో తన సోదరుడు సెల్వ రాఘవన్(‘7G బృందావన్ కాలనీ’ డైరెక్టర్) దర్శకత్వంలో ‘కాదల్ కొండై’ చిత్రం వచ్చింది. అది కూడా హిట్. ఈ సారి ధనుష్ తన సహజ నటనతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘తిరుడా తిరుది’ (తెలుగులో ‘దొంగ దొంగది’) చిత్రంలో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను కలిసే సమయానికి ధనుష్‌కు అంత క్రేజ్ లేదు. మొదటి సినిమా హిట్ కొట్టినా.. అప్పటికి ఇంకా కుర్ర హీరోనే.  

‘కాదల్ కొండై’తో పుట్టిన ప్రేమ: 2003లో ధనుష్ నటించిన రెండో చిత్రం ‘కాదల్ కొండై’ సినిమాను ఫస్ట్ షోను చూసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఇద్దరి కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలతో వచ్చారు. సినిమా తర్వాత థియేటర్ యజమాని ధనుష్‌కు ఐశ్వర్య, సౌందర్యలను పరిచయం చేశాడు. ఆ సమయంలో వారు పెద్దగా మాట్లాడుకోలేదు. హాయ్.. అంటూ కళ్లతోనే పరిచయం చేసుకున్నారు. తర్వాతి రోజు.. ఐశ్వర్య నుంచి ధనుష్‌కు ఒక ఫ్లవర్ బొకే వచ్చింది. తనతో టచ్‌లో ఉండాలని అందులో రాసి ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత వారిద్దరూ రెండేళ్లు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?

హడావిడిగా పెళ్లి..: ధనుష్, ఐశ్వర్య.. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. రజనీకాంత్ కూతురూ.. ధనుష్‌ను లవ్ చేస్తుందా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ షాక్ నుంచి తేరుకొనే లోపే.. ఇద్దరికీ పెళ్లి చేసిన వార్త బయటకు వచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం బయటకు రావడం, రూమర్స్ పెరగడంతో రజినీకాంత్ కుటుంబికులు ఇద్దరికీ 2004లో హడావిడిగా పెళ్లి చేశారు. అయితే, అప్పటికి ధనుష్‌కు 21 ఏళ్లు మాత్రమే. ఐశ్వర్యకు 23 ఏళ్లు. ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దది కావడంతో కొన్నాళ్లు వారి పెళ్లి వార్త వైరల్‌గా చక్కర్లు కొట్టింది. కేవలం మూడు సినిమాలే చేసిన ధనుష్‌ను రజినీ అల్లుడిగా ఎలా స్వీకరించాడని కొందరు ప్రశ్నించారు. ధనుష్ తన కెరీర్ కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరికొందరు అనుకున్నారు. కానీ, ధనుష్ ఏ రోజు తన సినిమాలకు రజినీకాంత్ క్రేజ్‌ను వాడుకోలేదు. కానీ, రజినీ అభిమానుల సపోర్టును మాత్రం పొందాడు. 

Also Read: ధ‌నుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ ప్రేమ‌లో ఉందా?

‘‘భార్యగా గర్విస్తున్నా’’ అని చెప్పిన మూడు నెలలకే..: ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు సాంప్రదాయాలకు విలువనిస్తారు. అందుకే మాకు అంత తొందరగా పెళ్లి చేసేశారు. కానీ, ఆ పెళ్లి నాకు సంతోషాన్ని ఇచ్చింది. మూడు నెలల కిందట చేసిన ఇన్‌స్టా పోస్ట్‌లో కూడా.. ‘‘ధనుష్‌కు భార్య కావడాన్ని గర్విస్తున్నా’’ అని పోస్ట్ చేసింది. ఈ మూడు నెలల్లో ఏమైందో ఏమో.. సోమవారం ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత-నాగ చైతన్య విడాకుల తర్వాత సినీ పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసిన మరో విడాకుల ఘటన ఇది. అయితే, సెలబ్రిటీలు విడిపోయినప్పుడు ముందుగా సోషల్ మీడియాలో తమ పేర్లను మార్చుకుంటారు. భర్త ఇంటి పేర్లను తీసేస్తారు. అయితే, ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ఐశ్వర్య ఆర్ ధనుష్ అనే పేరును మార్చకపోవడం గమనార్హం. 

Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..

Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 01:20 PM (IST) Tags: Dhanush Aishwarya Divorce Dhanush Aishwarya love story Dhanush Aishwarya love Dhanush Aishwarya Separated Dhanush Aishwarya Wedding ధనుష్ ఐశ్వర్య

సంబంధిత కథనాలు

Happy Birthday Movie Trailer: గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ -  'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ చూశారా?

Happy Birthday Movie Trailer: గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ -  'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ చూశారా?

Ram Pothineni: ‘నే హైస్కూల్‌కు వెళ్లలే’ - పెళ్లిపై రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్!

Ram Pothineni: ‘నే హైస్కూల్‌కు వెళ్లలే’ - పెళ్లిపై రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్!

Virata Pravam OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో 'విరాటపర్వం' - రిలీజ్ ఎప్పుడంటే?

Virata Pravam OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో 'విరాటపర్వం' - రిలీజ్ ఎప్పుడంటే?

Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ 

Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ 

Sapthagiri: బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతోన్న స్టార్ కమెడియన్ - వీడియో వైరల్

Sapthagiri: బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతోన్న స్టార్ కమెడియన్ - వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర

Sravana Bhargavi Reacts On Divorce: విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్  శ్రావణ భార్గవి, హేమచంద్ర

Searching For Tiger: కాకినాడజిల్లాలో తిరిగే పులి రూటు మార్చిందా? అనకాపల్లి జిల్లాలో పశువులపై దాడి ఎవరి పని?

Searching For Tiger: కాకినాడజిల్లాలో తిరిగే పులి రూటు మార్చిందా? అనకాపల్లి జిల్లాలో పశువులపై దాడి ఎవరి పని?

Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!

Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!

Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!

Xiaomi A2 TV Series: సూపర్ ఫీచర్లతో షియోమీ కొత్త టీవీలు - డిస్‌ప్లేలే పెద్ద ప్లస్ పాయింట్!