Dhanush Aishwarya Separation: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
ధనుష్-ఐశ్వర్య ఎందుకు విడాకులు తీసుకున్నారు. ఇందుకు కారణం ఎవరు? రజినీకాంత్ వల్లే ఐశ్వర్య అలా మారిపోయిందా?
తమిళంతోపాటు హిందీలోని బిజీగా మారిపోయిన హీరో ధనుష్.. సోమవారం రాత్రి తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్య రజినీకాంత్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన ధనుష్ అభిమానులనే కాదు.. రజనీకాంత్ ఫ్యాన్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. గత కొన్నాళ్లుగా వీరి విడాకులపై రూమర్స్ వస్తున్నా.. అవి నిజం కాదనే భావన అభిమానుల్లో ఉండేది. ధనుష్ ప్రకటన తర్వాత వారు ఎందుకు విడిపోవల్సి వచ్చిందనే సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ధనుష్, ఐశ్వర్యల మధ్య ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేవు. ఒక వేళ ఉన్నా.. అవి బయటకు కూడా రాలేదు. పైగా, ధనుష్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. తన పని తాను చేసుకుని పోతాడు. ఐశ్వర్య కూడా తండ్రి రజినీకాంత్ తరహాలోనే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. అయితే, ఇదే వారి విడాకులకు కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే, 18 ఏళ్లు కలిసి జీవించిన ఈ జంట అకస్మాత్తుగా విడిపోవడానికి మరేదైనా బలమైన కారణం ఉండవచ్చా అనే సందేహాలు కూడా ఉన్నాయి.
ఈ విడాకులకు ఐశ్వర్యనే ముఖ్య కారణమని తెలుస్తోంది. ఐశ్వర్య దర్శకత్వం, స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆమె డ్యాన్స్‌లో కూడా శిక్షణ పొందారు. కానీ, ఒక్కసారి సినీ రంగాన్ని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టారు. తండ్రి రజినీకాంత్‌తో కలిసి హిమాలయ యాత్రకు కూడా వెళ్లారు. అప్పటి నుంచి ఐశ్వర్యలో మార్పు మొదలైనట్లు తెలుస్తోంది. ఐశ్వర్య యోగాలో శిక్షణ తీసుకోవడమే కాదు, దానికి ప్రత్యేకంగా ఒక వెంచర్ కూడా ప్రారంభించారు.
గతేడాది ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మహిళలు బయటకు వచ్చి యోగా చేయడానికి ఇష్టపడరు. ఇంట్లో సమయాన్ని కేటాయించలేరు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా యోగా కేంద్రాన్ని ప్రారంభించాను. ఇటీవలే నాన్నతో కలిసి బద్రీనాథ్, కేదర్నాథ్ తదితర ప్రదేశాల్లో నడిచాను. అక్కడ నాన్నతో కలిసి టీ-షాపుల్లో టీ తాగడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతాలను సందర్శించాలి’’ అని తెలిపారు. అప్పటి నుంచి ఐశ్వర్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. కుటుంబానికి సమయం కూడా కేటాయించడం ఆమెకు కష్టమైందని తెలుస్తోంది. ధనుష్‌ను కూడా తనకు సహకరించాలని ఆమె కోరినట్లు సమాచారం.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!
మొదట్లో ధనుష్ ఇందుకు అంగీకరించినా.. బాలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకోలేకపోయాడు. అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగినట్లు తెలిసింది. విడాకుల నిర్ణయానికి ముందు ఇద్దరు రజినీకాంత్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే, రజినీ ఆ నిర్ణయాన్ని వారికే వదిలేశారని, అందుకే విడాకుల ప్రకటన చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్-ఐశ్వర్యలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. దనుష్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కస్తూరీ రాజా కుమారుడు. 2004 సంవత్సరంలో వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి