Aishwarya: ధనుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వర్యా రజనీకాంత్ ప్రేమలో ఉందా?
హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె - దర్శకురాలు ఐశ్వర్య విడాకుల వార్త చాలా మందికి షాక్ ఇచ్చింది. అయితే... ధనుష్ కంటే ముందు మరో హీరోతో ఐశ్వర్య ప్రేమలో ఉన్నారా?

ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. అందువల్ల, తామిద్దరం విడిపోతున్నామని వారిద్దరి నుంచి వచ్చిన ప్రకటన కొందరికి షాక్ ఇచ్చింది. ఎందుకు అంత షాక్? పద్దెనిమిదేళ్ల ధనుష్ - ఐశ్వర్య వైవాహిక జీవితంలో వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదా? వారిద్దరి గురించి పుకార్లు వినిపించలేదా? అంటే... ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. అలాగే, వారి మధ్య కూడా ఉండి ఉండవచ్చు. అలాగే, నాలుగేళ్ల క్రితమే పుకార్లు వచ్చాయి. అయితే... ఆ తర్వాత సద్దుమణిగాయి. అంతా హ్యాపీగా ఉందని జనాలు అనుకుంటున్న సమయంలో విడాకుల ప్రకటన రావడం షాకింగ్ అన్నమాట.
హ్యాపీ న్యూస్‌తో వార్తల్లో ఉండటం కంటే... శాడ్ న్యూస్‌తో, అదీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో ఈ విధంగా వార్తల్లో ఉండటం బహుశా ఐశ్వర్యకు ఇది రెండోసారి ఏమో!? గతంలో ఓసారి శింబుతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ చెన్నై కోడంబాక్కమ్ సర్కిల్స్‌లో పుకార్లు షికార్లు చేశాయి. శింబు, ఐశ్వర్య ప్రేమ విషయం రజనీకాంత్‌కు తెలిసి డిజప్పాయింట్ అయ్యారని, కూతురుకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టారని కూడా తమిళ జనాలు గుసగుసలాడుకున్నారు. కొన్ని రోజులకు ధనుష్, ఐశ్వర్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అదీ సంగతి!
Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
ఐశ్వర్యతో మాత్రమే కాదు... చాలా మంది హీరోయిన్లతో శింబు ప్రేమ కలాపాలు సాగించాడని తమిళ సినిమా ఇండస్ట్రీ చెబుతోంది. అందులో నయనతార, హన్సికతో ప్రేమకథలు మీడియాకు తెలిసినవే. ఇక... శింబు లవర్స్ జాబితాలో ఒకప్పుడు త్రిష పేరు కూడా వినిపించింది. ఇప్పుడు నిధి అగర్వాల్ పేరు బలంగా వినబడుతోంది.
View this post on Instagram
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

