By: ABP Desam | Updated at : 18 Jan 2022 04:08 PM (IST)
మహేశ్వరి (Image courtesy - @ETV Telugu India/Youtube)
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లి సుమారు నాలుగేళ్లు. ఫిబ్రవరి 24న ఆమె వర్ధంతి. అయితే... ఆమె మరణం ఎంతో మందికి శోకాన్ని మిగిల్చింది. ఇక, కుటుంబ సభ్యుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. శ్రీదేవి మరణ వార్తను జీర్ణించుకోవడానికి చాలా మందికి సమయం పట్టింది. మరి, కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? అంటే... మరణించిందని అనుకోవడం లేదనన్నారు మహేశ్వరి.
'గులాబీ' సినిమా కథానాయిక మహేశ్వరి గుర్తు ఉన్నారు కదా! ఆ తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేసినా... ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఓ ముద్ర వేసుకుంది. శ్రీదేవి తనకు చిన్నమ్మ అవుతారని మహేశ్వరి చెప్పారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆవిడ... శ్రీదేవితో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించారు. 'శ్రీదేవికి మహేశ్వరి ఏం అవుతారనేది నాకు తెలుసు. కానీ, చాలా మందికి కన్‌ఫ్యూజన్. మీరు ఆమెకు ఏం అవుతారు?' అని ఆలీ ప్రశ్నించారు.
"శ్రీదేవి గారు నాకు చిన్నమ్మ. అయితే... నాకు అక్క అని పిలిచే అలవాటు. 'పప్పక్క... పప్పక్క' అని పిలిచేదాన్ని. మాకు అయితే... ఇంకా ఆవిడ విదేశాల్లో ఒక షూటింగ్ లేదంటే షో చేస్తున్నట్టు ఉంది. మాకు ఇంకా అలా (మరణించారని) అనుకోబుద్ది కావడం లేదు" అని మహేశ్వరి ఆన్సర్ ఇచ్చారు. తాను రిజర్వ్డ్ కావడం వల్ల తనకు పొగరు అని చాలా మంది అనుకున్నారని, కొంత మంది ముఖం మీద చెప్పారని ఆమె వెల్లడించారు. ఇక... 'గులాబీ' సినిమాలో 'మేఘాలలో తేలిపోతున్నది' సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు ఒక లోయలో పడిన ఘటన కూడా గుర్తు చేసుకున్నారు. ప్రాణాపాయం తప్పిందని చెప్పుకొచ్చారు. తనకు ఓ పెద్దాయన రూ. 50 వేలు ఇవ్వాలని కూడా మహేశ్వరి తెలిపారు. ఇప్పుడు ఆ పెద్దాయన కనిపించినా అడుగుతానని అన్నారు. అయితే... ఆ పెద్దాయన ఎవరు? అనేది అటు ఆలీ, ఇటు మహేశ్వరి చెప్పలేదు.
Also Read: హీరోగా సప్తగిరి... మాస్ చిత్రాల దర్శకుడితో కొత్త సినిమా!
Also Read: కీర్తీ సురేష్‌కు కరోనా తగ్గింది. అయితే... ముఖంలో ఆ మార్పు గమనించారా?
Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
Also Read: ధనుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వర్యా రజనీకాంత్ ప్రేమలో ఉందా?
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?
Sardar Movie: నాగార్జున చేతికి కార్తీ 'సర్ధార్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
Manchu Manoj: మంచు మనోజ్ సినిమా నుంచి డైరెక్టర్ వాకౌట్!
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు