By: ABP Desam | Updated at : 20 Jan 2022 07:59 AM (IST)
ఐశ్వర్య - ధనుష్, సమంత - నాగచైతన్య, చిన్మయి (Image courtesy - Social Media)
విడాకులకు, డబ్బుకు సంబంధం లేదని గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి అన్నారు. సినిమా వాళ్లకు ఎన్ని డబ్బులు ఉన్నా ఉపయోగం లేదని, విడాకులు తీసుకుంటున్నారని చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ధనుష్ - ఐశ్వర్య, అంతకు ముందు అక్కినేని నాగచైతన్య - సమంత, ఇంకొంచెం ముందుకు వెళితే ఆమిర్ ఖాన్ - కిరణ్ రావ్... వైవాహిక బంధం నుంచి వేరు పడిన సెలబ్రిటీలు కొందరు ఉన్నారు. ఆ మాటకు వస్తే... సినిమా సెలబ్రిటీల్లో మాత్రమే కాదు, సమాజంలో విడాకులు తీసుకున్న వారు మనకు కనిపిస్తారు. అయితే... సినిమా జనాల విడాకుల మీద విమర్శలు వస్తున్నాయి. కొందరు ట్రోల్ చేస్తున్నారు.
"ఏది ఏమైనా మన పేరెంట్స్ చాలా గ్రేట్ రా! ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్జస్ట్ అవుతారు. ఈ సినిమా వాళ్లు చూడు. ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు" అని ఒకరు చేసిన ట్రోల్ చిన్మయి దృష్టికి వచ్చింది. 'డబ్బులు ఉన్నా, లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నారా? గ్రేట్' అంటూనే ఆమె గట్టిగా బదులిచ్చారు. ఇటువంటి విమర్శలు కట్టిపెట్టాలని అన్నట్టు 'ఇక చాలు' అని పేర్కొన్నారు.
"ఓ జంట కలిసి ఉండాలి? విడిపోవాలా? అనేదానికి డబ్బుతో సంబంధం లేదు. ఉన్న కొంచెం డబ్బును కూడా తాగి కుటుంబాలను నాశనం చేసే మొగుళ్లతో ఆడవాళ్లు కాపురం చేసే కర్మ ఉంది ఇంకా. రోజు తన్నులు తిని, డబ్బులు దాచిపెట్టి పిల్లల్ని చదివించి పెంచిన తల్లులే ఈ సమాజంలో ఎక్కువ. కట్నం తీసుకుంటూ, పురిటి ఖర్చులు కూడా భరించలేక 'ట్రెడిషన్' (ఆచారం) అని వాగుడు, రకరకమైన కట్నాలు డిమాండ్ చేయడం! గృహ హింస నుంచి ఆర్ధిక, భావోద్వేగ దాడిని సహిస్తూ జీవించే జీవితం ఒక జీవితమే కాదు. ఈ త్యాగాలు, నాన్ సెన్స్ ఆపి... మీ పని మీరు చూసుకోండి. మిగతావాళ్ల ఇంట్లో ఎవరు కాపురం చేస్తున్నారు? బిడ్డలు పెంచారు? విడిపోయారు? అంటూ ఇతరుల జీవితాల్లో తొంగి చూడటం ఆపేయవచ్చు. మీకు నిజంగా ధైర్యం ఉంటే... ముందు మీ తల్లిదండ్రులను, ముఖ్యంగా మీ తల్లిని అడగండి. 'పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారా?' అని! చాలామంది 'ఎదో ఈ జన్మకు రాసింది ఇంతే' అని చెబుతారు. సమాజం కోసం, పిల్లల కోసం చాలా మంది తల్లిదండులు ఒకరినొకరు భరించారు. నిజంగా అది విచారకరం" అని చిన్మయి పేర్కొన్నారు.
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్