అన్వేషించండి

Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే

థియేటర్లలోకి సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు చూస్తే... ఆరేడు వరకు సందడి చేసేలా ఉన్నాయి. అయితే... అన్ని సినిమాల్లో ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏమిటో తెలుసా?

సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో పోటీ ఓ లెక్క... ఇప్పుడు మరో లెక్క. మొత్తం మీద 2024లో ఆరేడు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో స్ట్రెయిట్ సినిమాలు ఐదు ఉన్నాయి. డబ్బింగ్ రెండు మూడు ఉంటాయి. ఈ సినిమాలు అన్నిటిలో ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏమిటో తెలుసా? ఫ్రెష్ బాబు ఫ్రెష్... ఫ్రెష్ కాంబినేషన్ బాబూ! సంక్రాంతి సినిమా ఏదైనా తీసుకోండి... అందులో జంటగా నటించిన హీరో హీరోయిన్లకు అది తొలి సినిమా.

మహేష్ & శ్రీలీల... మహేష్ & మీనాక్షి
Mahesh Babu, Sreeleela: సంక్రాంతి సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న, ఎక్కువ థియేటర్లలో విడుదలకు సిద్ధమైన సినిమా 'గుంటూరు కారం'. అందులో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇప్పటి వరకు వాళ్లిద్దరూ నటించలేదు. సో... మహేష్ & శ్రీ లీల, మహేష్ & మీనాక్షీ కాంబినేషన్ ఫ్రెష్! తొలుత ఈ సినిమాలో ఓ కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. కారణాలు ఏమైనా మధ్యలో ఆమె వైదొలిగారు. పూజ కనుక ఉండి ఉంటే... ఓ ఫ్రెష్ కాంబినేషన్ చూసే ఛాన్స్ మిస్ అయ్యేది.

Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?

Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
Mahesh Babu Meenakshi Chaudhary: 'గుంటూరు కారం'లో శ్రీ లీలను ప్రేక్షకులకు చూపించిన త్రివిక్రమ్, ఇంకా మీనాక్షీ చౌదరిని మాత్రం చూపించలేదు. ఆవిడ లుక్ ఎలా ఉంటుందో మరి? ఆల్రెడీ 'కుర్చీ మడతపెట్టి' పాటలో మహేష్, శ్రీ లీల వేసిన స్టెప్పులకు రెస్పాన్స్ అదిరింది. ఇక థియేటర్లలో ఈ కాంబినేషన్ రచ్చ రచ్చ చేయడం గ్యారంటీ.

నా సామి రంగ... ఆషికతో కింగ్
Nagarjuna Ashika Ranganath: సంక్రాంతి బరిలో విడుదల అవుతున్న మరో సినిమా 'నా సామి రంగ'. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున జోడీగా ఆషికా రంగనాథ్ నటించారు. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. నాగార్జునతో మొదటిది. మన్మథుడితో కన్నడ ముద్దుగుమ్మ కెమిస్ట్రీ బావుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

Also Read: పెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
'నా సామి రంగ' నుంచి ఆల్రెడీ విడుదలైన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే...' పాటలో నాగార్జున, ఆషిక జోడీ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లుక్స్, సీన్స్ చేయడంలో నాగ్ స్పెషలిస్ట్. ఆయనకు సపరేట్ స్టైల్ ఉంది. ఆషిక అందం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో ఇంకెలా ఉంటుందో చూడాలి మరి? అన్నట్టు... ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటించారు. వాళ్ళది కూడా ఫ్రెష్ కాంబినేషన్.

'సైంధవ్' సైకో మామతో శ్రద్ధా శ్రీనాథ్
Venkatesh Shraddha Srinath: సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. 'సైంధవ్' సినిమాలో విక్టరీ వెంకటేష్ భార్యగా నటించారు. నాని 'జెర్సీ'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్... ఆ తర్వాత ఆది సాయి కుమార్ 'జోడీ', సిద్ధూ జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలు చేశారు. వెంకీతో సినిమా చేయడం ఇదే తొలిసారి. మరి, సినిమాలో ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలి!

Also Readతండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్ కాకుండా యంగ్ హీరోయిన్లు రుహానీ శర్మ, ఆండ్రియా సైతం ఉన్నారు. అయితే... వాళ్ళు హీరోకి పెయిర్ కాదు. కీలక పాత్రల్లో మాత్రమే నటించారు.

'ఈగల్' విడుదలకు ముందు వైరల్ జోడీ
Ravi Teja Kavya Thapar: సంక్రాంతి బరి నుంచి 'ఈగల్' తప్పుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, దర్శక నిర్మాతలు గానీ, హీరో గానీ ఆ విషయాన్ని చెప్పలేదు. విడుదల విషయం పక్కన పెడితే...'ఈగల్'లో మాస్ మహారాజా రవితేజ సరసన 'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్యా థాపర్ నటించారు. ఆల్రెడీ ఈ జోడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా

Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
సినిమా ప్రెస్‌మీట్‌లో రవితేజ, కావ్యా థాపర్ క్యూట్ మూమెంట్స్ మీద నెట్టింట చాలామంది కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఇద్దరి జోడీ బావుంది. మరి, సినిమాలో ఎలా ఉంటుందో? 'హనుమాన్' సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది తెలియదు కానీ... తేజా సజ్జా, అమృతా అయ్యర్ జోడీకి అది తొలి సినిమా.

డబ్బింగ్ సినిమాలు చూసినా ఫ్రెష్ కాంబినేషన్లు!
జనవరి 12న హిందీలో 'మేరీ క్రిస్మస్' విడుదల అవుతోంది. ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించారు. వాళ్ళ కాంబినేషన్‌లో అది మొదటి సినిమా. మరో కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా 'కెప్టెన్ మిల్లర్' కూడా సంక్రాంతి బరిలో విడుదల అవుతోంది. అందులో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్. ధనుష్ సరసన ఆమెకు తొలి చిత్రమిది. 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలతో తెలుగులో భారీ విజయాలు అందుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్. 'అయలాన్'తో ఆయన సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమాలో రకుల్ హీరోయిన్. ఇదీ ఫ్రెష్ కాంబినేషన్.

Also Readయాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?

హిట్ సినిమాలో జోడీ రిపీట్ అయితే ఓ విధమైన క్రేజ్ ఉంటుంది. ఒకవేళ కొత్త హీరో హీరోయిన్లు నటిస్తే... వాళ్ళ జోడీ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? సన్నివేశాలు ఎలా ఉంటాయి? డ్యాన్సులు ఎలా చేస్తారు? అని క్రేజ్ నెలకొంటుంది. కొత్త కాంబినేషన్ కుదిరినప్పుడు సన్నివేశాల్లో కూడా కొత్తదనం కనబడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget