Aamir Khan Daughter Wedding: తండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?
Ira Khan Nupur Shikhare Wedding: ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్, ఫిట్నెస్ కోచ్ నుపుర్ శిఖరే వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఇంతకీ, ఎవరీ నుపుర్? ఆమిర్ కుమార్తెను ప్రేమలో ఎలా పడేశారు?
ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె ఐరా ఖాన్ వివాహ బంధంలో (Ira Khan Wedding) అడుగు పెట్టారు. నుపుర్ శిఖరేను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత చిన్నపాటి రిసెప్షన్ కూడా జరిగింది.
సోమవారం (జనవరి 8న) రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో మరోసారి బ్యాండ్ బాజాలతో పెళ్లి చేసుకోనున్నారు. జనవరి 13న హిందీ చిత్రసీమ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇంతకీ, ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటి? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కుమార్తెను ప్రేమలో ఎలా పడేశారు? వంటి వివరాల్లోకి వెళితే...
ఎవరీ నుపుర్ శిఖరే? అతనిది ఏ ఊరు?
Who Is Nupur Shikhare, son in law of Aamir Khan: నుపుర్ శిఖరే ఫిట్నెస్ కోచ్. అక్టోబర్ 17, 1985లో జన్మించారు. అతని స్వస్థలం పుణె. చదువు కోసం కొన్నేళ్ల క్రితం ముంబై వెళ్లారు. తర్వాత ఆ సిటీలో సెటిల్ అయ్యారు. నుపుర్ తల్లి పేరు ప్రీతమ్ శిఖరే. ఆమె కథక్ డాన్సర్. సుశ్మితా సేన్ కుమార్తె రీమాకు ఆమె కథక్, నటనలో శిక్షణ ఇస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ నుపుర్ శిఖరే పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఆమిర్ కుమార్తె ఐరాను ప్రేమలో ఎలా పడేశారు?
How Ira Khan and Nupur Shikhare met each other: ఆమిర్ ఖాన్, సుశ్మితా సేన్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలకు నుపుర్ శిఖరే ఫిట్నెస్ కోచ్. కరోనా చాలా మంది జీవితాల్లో శోకం నింపింది. అయితే, ఆమిర్ కుమార్తెకు జీవిత భాగస్వామి దొరికేలా చేసింది.
కరోనా కాలంలో ఆమిర్ ఖాన్ (Aamir Khan)కు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆయన ఇంటికి వెళ్లారు నుపుర్ శిఖరే. ఆ సమయంలో తండ్రితో పాటు ఐరా ఖాన్ సైతం అదే ఇంటిలో ఉన్నారు. తండ్రితో పాటు కుమార్తెకు కూడా ఫిట్నెస్ ట్రైనర్ అయ్యారు నుపుర్. ఇద్దరి మధ్య తొలి పరిచయం అక్కడే జరిగింది. ఆ తర్వాత మెల్లగా ప్రేమలో పడ్డారు. ఒకరి మనసులో మరొకరు చోటు సంపాదించుకున్నారు.
Also Read: నవంబర్‌లో పెళ్లి, జనవరిలో ప్రెగ్నెన్సీ - తల్లి కాబోతున్న 'నాయక్' హీరోయిన్
నుపుర్ శిఖరేకు ఫిట్నెస్ అంటే ప్రాణం. ముంబైలో పెళ్లి జరిగిన తాజ్ ల్యాండ్స్ హోటల్‌కు తన ఇంటి నుంచి 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వచ్చారు. ఆ దుస్తుల్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్‌కు డ్రస్ మార్చుకున్నారు. ఫిట్నెస్‌తో పాటు ఇప్పుడు ఐరా కూడా నుపుర్ శిఖరేకు ప్రాణం అయ్యారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ మారథాన్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఇటలీ వెళ్ళినప్పుడు ఐరాకు ప్రపోజ్ చేశారు నుపుర్. ఆమె సంతోషంగా పెళ్లికి ఓకే చెప్పారు. ఇదీ ఆమిర్ కుమార్తె ప్రేమ్ కహాని. బాలీవుడ్ జనాలకు, సోషల్ మీడియాలో ఐరాను ఫాలో అయ్యే వాళ్ళకు ఆమె ప్రేమలో ఉన్నారని తెలుసు. తరచూ నుపుర్ శిఖరేతో దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు.
Also Read: 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా