Amala Paul Pregnancy: నవంబర్‌లో పెళ్లి, జనవరిలో ప్రెగ్నెన్సీ - తల్లి కాబోతున్న 'నాయక్' హీరోయిన్
Amala Paul And Jagat Desai announce pregnancy: హీరోయిన్ అమలా పాల్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని భర్త జగత్ దేశాయ్ తో కలిసి అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
కొత్త ఏడాది ప్రారంభంలో హీరోయిన్ అమలా పాల్ కొత్త కబురు చెప్పారు. జీవితంలో మాతృత్వపు మధురిమ అనుభూతి చెందడానికి ఆమె సిద్ధం అవుతున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రేక్షకులు అందరికీ ఆమె చాలా సంతోషంగా చెప్పారు. తెలుగులో అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల్లో అమలా పాల్ నటించారు. ఇప్పుడు ఆమె అమ్మ కాబోతున్నారు అన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళితే...
తల్లి కాబోతున్న అమలా పాల్
అవును... మీరు చదివింది నిజమే. హీరోయిన్ అమలా పాల్ తల్లి కాబోతున్నారు. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ఆవిడ స్వయంగా తెలియజేశారు. ''నీతో (భర్త జగత్ దేశాయ్) జీవితాన్ని పంచుకుంటే... 1+1 = 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది'' అని అమలా పాల్ పేర్కొన్నారు. బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేశారు.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
View this post on Instagram
నవంబర్ నెలలో పెళ్లి... జనవరిలో ప్రెగ్నెన్సీ
అమలా పాల్, జగత్ దేశాయ్ గత ఏడాది (2023) నవంబర్ 6న వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. పెళ్లి చేసుకోవడానికి పది రోజుల ముందు... అమలా పాల్ పుట్టినరోజు నాడు, అక్టోబర్ 26న ఆమెకు ప్రపోజ్ చేశారు జగత్ దేశాయ్. అప్పుడు పెళ్లికి 'ఎస్' చెప్పారు అమల. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లైన రెండు నెలలకు తాను గర్భవతి అని ఆమె వెల్లడించారు.
ఇంతకీ, ఎవరీ జగత్ దేశాయ్!?
అమలా పాల్ పుట్టినరోజు నాడు జగత్ దేశాయ్ పేరు మార్మోగింది. ఆయన ఎవరు? అని పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. జగత్ దేశాయ్ సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. కానీ, సినిమా వాళ్ళు కొందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఈవెంట్ ఆర్గనైజర్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అమలా పాల్, జగత్ దేశాయ్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు.
Also Read: 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా
జగత్ దేశాయ్ (Jagat Desai)తో వివాహం అమలా పాల్ (Amala Paul)కు రెండోది. అంతకు ముందు తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. కథానాయికగా ప్రయాణం ప్రారంభించిన మూడేళ్లకు అమలా పాల్ పెళ్లి చేసుకున్నారు. విక్రమ్ 'నాన్న' (తమిళంలో 'దైవ తిరుమగల్')లో నటించినప్పుడు... ఆ సినిమా దర్శకుడు ఏఎల్ విజయ్, అమలా పాల్ ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకు వేరు పడ్డారు.
Also Read: ఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున