Venu Swamy: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
Astrologer Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి సంబధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన జాతకం చెప్పలేదు. యాక్టింగ్ చేశారు.
Astrologer Venu Swamy as junior artist: టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లతో పాటు రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రజల్లో బాగా పాపులర్ అయ్యారు. కొందరు హీరోయిన్లు ఆయన దగ్గరకు వెళ్లి పూజలు, హోమాలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదని, కొత్త జంట వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి త్వరలో విడాకులు తీసుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండి పడుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద వేణు స్వామి ఎందుకు పడ్డారు? అంటే... నటుడిగా ఆయనకు ఛాన్సులు రాకపోవడమే అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు... వేణు స్వామి నటించిన వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నారు కూడా! సోషల్ మీడియా ఇప్పుడు ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
'జగపతి'లో వేణు స్వామి...
పూజారిగా చిన్న వేషంలో!
జగపతి బాబు, రక్షిత జంటగా నటించిన సినిమా 'జగపతి'. అందులో వేణు స్వామి ఓ చిన్న పాత్రలో నటించారు. వెండితెరపై కూడా ఆయన పూజారిగా కనిపించడం విశేషం. 'ఏయ్ పంతులూ... గుడిలో తిరునాళ్ళకు బాగా డబ్బులు పోగయ్యాయి అంటగా! మొత్తం పోలీస్ స్టేషన్‌కు పంపించు' అని జగపతి బాబు అడిగితే... ''అలాగే సార్ పంపిస్తాను అండి'' అని సమాధానం చెబుతారు. ఆ తర్వాత రక్షితతో ''చూశావమ్మా దారుణం. ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు. కానీ, ఇతడు గుడిలోనే తప్పు చేస్తున్నాడు'' అని డైలాగ్ చెబుతారు.
ఈ వీడియో కింద ఒక నెటిజన్ ''నటుడి కాబట్టి ఇంకా నటించగలుగుతున్నాడు'' అని కామెంట్ చేశారు. ''సినిమాల్లో అవకాశాలు నిలబెట్టుకోలేదు అనే ఫ్రస్ట్రేషన్‌తో సినిమా వాళ్ళ మీద పడ్డాడు ఏమో'' అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
Also Read: బెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?
Natudu kabati inka natainchagalugutunadu
— loki (@Th8Mischief) January 3, 2024
Cinema lu lo chance nilabettukoledu ane frustration tho cinema vala meda paddadu emo
— 𝐑𝐎𝐋𝐄𝐗 🦂 (@praveen_shooter) January 2, 2024
మహేష్ బాబు 'అతడు' సినిమాలోనూ...
'జగపతి' సినిమాలో మాత్రమే కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అతడు'లోనూ వేణు స్వామి నటించారు. అందులో కూడా ఆయన పురోహితుడు క్యారెక్టర్ కావడం విశేషం. పాటలో త్రిష అక్కకు పెళ్లి చేయించే పూజారిగా కనిపించారు.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?
Ikkada kuda unnaadu chillar gaadu 😝
— Just_JanakiRam (@Just_JanakiRam_) January 2, 2024
Baabu Cinema lo Junior artist gaadivi neekendhuku ra Prabhas Future Prediction lu... 🥱
Edhainaa pani cheskora Bewakoof 😪 pic.twitter.com/QhKBC2xEC8
వేణు స్వామి యాక్టింగ్ మీద నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ''వార్నీ వీడి టాలీవుడ్ లింక్ ఇదా'' అని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ''ఇలా మొదలైంది అన్నమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద విలనిజం చూపించడానికి కారణం ఇది'' అని కామెంట్ చేశారు.
Also Read: 2024లో 'యానిమల్' సంగీత దర్శకుడి ఫస్ట్ సినిమా ఏదో తెలుసా?
-
That's how it started.. his villain origin fr tfi https://t.co/t6Ud5ct5cj
— Kalyan (@kalyanstark_) January 2, 2024
Vaarni veedi Tollywood link idhaa https://t.co/K4XucPsutW
— Gordon gekko (@gultwarrior) January 2, 2024
Ah venu swamy gaadu andhari jathaakaalu chepthuntey , nuvvu vaadi jathakam cheppav bro 😅😅 https://t.co/HDy5XfQTTK
— SunTzu (@sekhararistrotl) January 2, 2024