Suma Kanakala Singer Sunitha: సుమ కొడుకు vs సింగర్ సునీత కొడుకు... ఇద్దరిలో ఎవరు బెటర్?
Roshan Kanakala vs Akash Goparaju: 'బబుల్‌గమ్' సినిమాతో రోషన్ కనకాల, 'సర్కారు నౌకరి' సినిమాతో ఆకాష్ గోపరాజు హీరోలుగా పరిచయం అయ్యారు.
Bubblegum Movie vs Sarkaaru Noukari Movie: సుమ కనకాల కుమారుడు రోషన్, ఫేమస్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు నాలుగు రోజుల వ్యవధిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు.
రోషన్ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్ గమ్' డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. ఇక, సుమ కొడుకు ఆకాష్ గోపరాజు తొలి సినిమా 'సర్కారు నౌకరి' న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరిలో ఎవరు బెటర్? ప్రేక్షకులలో ఎవరికి ఎక్కువ పేరు వచ్చింది. రెండిటిలో ఏ సినిమా బావుంది? ఎవరికి మంచి లాంచ్ దొరికింది? వంటి వివరాల్లోకి వెళితే...
సుమ ట్రెండీ ఆలోచనలు...
సునీత ఓల్డ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్
సుమ, సునీత మంచి స్నేహితులు. తనయులను పరిచయం చేసే విషయంలో ఈ స్నేహితుల ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. ట్రెండీ, యూత్ సినిమాను సుమ కనకాల సెలెక్ట్ చేసుకుంటే... ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను సునీత ఓకే చేశారు. 'బబుల్ గమ్' కథలో యువతను అట్ట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువ. సాంగ్స్ కూడా బావున్నాయి. 'సర్కారు నౌకరి'లో సందేశం, హీరో భావోద్వేగం తప్ప ఏమీ లేదు. పాటలు మళ్లీ వినేలా లేవు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖుల చేత ఇద్దరూ తమ కుమారుల సినిమాలకు సుమ, సునీత ప్రచారం చేయించారు. అయితే... సుమ కోసం యంగ్ హీరోలు అందరూ వచ్చారు. పబ్లిసిటీ విషయంలో 'సర్కారు నౌకరి' కంటే 'బబుల్ గమ్'కు ఎక్కువ మైలేజీ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. రెండు సినిమాలకూ గొప్ప రివ్యూలు రాలేదు. అయితే, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సుమ కొడుకు సినిమాయే సునీత కొడుకు సినిమా కంటే బెటర్ అని పేరు తెచ్చుకుంది.
రోషన్ వర్సెస్ ఆకాష్... ఎవరు బెటర్?
'బబుల్ గమ్'లో ఈ తరం కుర్రాడిగా రోషన్ కనకాల కనిపించారు. కాస్ట్యూమ్స్, లుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ యువత కనెక్ట్ అయ్యేలా ఉంది. 'సర్కారు నౌకరి' కథా నేపథ్యం 90లలో ఉండటం ఆకాష్ గోపరాజు డ్రెస్సింగ్ స్టైల్ ఓల్డ్ స్కూల్‌ను తలపించింది. 'గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు' అని పూరి జగన్నాథ్ 'పోకిరి'లో ఓ డైలాగ్ చేశారు. అది నిజమే అన్నట్లు... 'సర్కారు నౌకరి'లో మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
Also Read: సర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా
యాక్టింగ్, యాటిట్యూడ్, లుక్స్ పరంగా చూసినా సరే సుమ కొడుకు రోషన్ కనకాల ఓ అడుగు ముందు ఉన్నాడు. 'బబుల్ గమ్'లో ఇంటర్వెల్ సీన్‌లో రోషన్ నటన అందరి చేత ప్రశంసలు అందుకుంది. 'సర్కారు నౌకరి'లో ఆకాష్ నటన గురించి చెప్పే ఆ విధమైన సన్నివేశం ఒక్కటి కూడా పడలేదు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడన్నారు కానీ అతని లుక్స్, యాక్టింగ్‌లో మెరుపుల గురించి ఎవరు ప్రత్యేకంగా మాట్లాడటం లేదు.
'బబుల్ గమ్'కు నెగిటివ్ రివ్యూలు రాలేదని చెప్పడం లేదు. అయితే, పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో సుమ సూపర్ సక్సెస్ అయ్యారు. యాంకరింగ్‌లో ఆమెకు ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. దాన్ని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం రొమాంటిక్ లవ్ సబ్జెక్టు సెలెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్లలో లిప్ లాక్స్ గురించి స్టేజి మీద ఆవిడ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. 'బబుల్ గమ్'లో న్యూ ఏజ్ క్యారెక్టర్ రోషన్ కనకాల యాక్టింగ్ ఎబిలిటీస్ బయటకు తీస్తే... 'సర్కారు నౌకరి' ఆకాష్ గోపరాజుకు అటువంటి లాంచ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. రెండు సినిమాల్లోనూ లిప్ లాక్స్ ఉన్నాయి. అయితే... రోషన్ కనకాలకు తన డ్యాన్సింగ్, ఫైటింగ్ స్కిల్స్ చూపించే అవకాశం 'బబుల్ గమ్'తో లభించింది. ఆకాష్ డ్యాన్స్ ఎలా చేస్తాడో తెలియదు. ఫైట్స్ ఎలా చేస్తాడో తెలియదు. 'సర్కారు నౌకరి' కథలో అటువంటి ఎలిమెంట్స్ లేవు. ఓవరాల్ గా చూస్తే... సుమ కొడుకు బెటర్ అనిపించుకున్నాడు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?