Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ప్రీమియర్‌తోనే రికార్డు కలెక్షన్స్ - పవన్ OG, యానిమల్‌ను దాటేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం ప్రీమియర్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందని నేషనల్ మీడియా పేర్కొంది.

Ranveer Singh's Dhurandhar 2 Premiere Collections : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా వచ్చిన 'ధురంధర్ : ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ప్రీమియర్లతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.
అత్యధిక వసూళ్లు
'ధురంధర్ 2' వరల్డ్ వైడ్ ప్రీమియర్లతోనే రూ.75 కోట్ల వసూళ్లు సాధించినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అటు, ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. కేవలం ప్రీమియర్లతోనే $2.5M (దాదాపు రూ.20 కోట్లకు పైగా) హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఇంతటి కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
పవన్ 'OG'ని మించి...
గతేడాది వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG'ని మించి ప్రీమియర్ల కలెక్షన్లలో సరికొత్త హిస్టరీ సాధించింది ధురంధర్ 2. OG ఇండియాలో రూ.25 కోట్లకు పైగా గ్రాస్‌తో అతి పెద్ద ప్రీమియర్‌గా నిలిచింది. రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ధురందర్ 2 ఆ రికార్డు అధిగమించింది. ఓవర్సీస్‌లో యానిమల్ ($1.2M) మూవీ రికార్డును సైతం వెనక్కు నెట్టింది. ఫస్ట్ డే షోస్ పూర్తయ్యే నాటికి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటూ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్నీ ప్రాంతాల్లోనూ ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లు సందడి చేస్తున్నాయి. బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'స్త్రీ 2'ను సైతం అధిగమించింది. ఈ మూవీ ప్రీమియర్లతో రూ.10 కోట్లకు పైగా మాత్రమే వసూలు చేయగా... ధురంధర్ 2 రూ.50 కోట్ల మార్క్ దాటేసింది.
Also Read : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు. గతేడాది వచ్చిన 'ధురంధర్'కు సీక్వెల్‌గా వచ్చిన మూవీలో ఫస్ట్ పార్ట్‌లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది.
దేశ భక్తి ఉన్న జస్కి రాత్ సింగ్ తన పేరును హమ్జా అలీ మజారీ (రణవీర్ సింగ్)గా ఎందుకు మార్చుకున్నాడు? దేశ సైన్యంలో చేరాలనుకుని పాక్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పాక్‌లో రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత హమ్జా అలీ ఏం చేశాడు? భారత్ మీద పాక్ తీవ్రవాద కుట్రలను అడ్డుకోగలిగాడా? పాక్‌పై హమ్జా ఎలాంటి రివేంజ్ తీసుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























