Naa Saami Ranga OTT: నా సామి రంగ ఓటీటీ - డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున
Naa Saami Ranga movie ott platform: నాగార్జున లేటెస్ట్ సినిమా 'నా సామి రంగ' డిజిటల్ అండ్ శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ టీవీ నెట్వర్క్ తీసుకుంది. ఈ డీల్ వెనుక కింగ్ ఉన్నారని ఫిల్మ్ నగర్ ఖబర్.
Naa Saami Ranga movie digital streaming platform: 'నా సామి రంగ' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో విడుదల చేయాలని నాగార్జున పట్టుదలతో ఉన్నారు. అందుకోసం విరామం లేకుండా చిత్రీకరణ చేస్తున్నారు. సోలోగా రిలీజ్ అయితే సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. బరిలో నాలుగైదు సినిమాలు ఉన్నప్పుడు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్స్ తగ్గుతాయి.
'నా సామి రంగ' సినిమాకు రూ. 45 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. థియేటర్ల నుంచి ఎంత రికవరీ అవుతుంది? అని నిర్మాత టెన్షన్ పడుతున్న సమయంలో నాగార్జున రంగంలోకి దిగి డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ అమౌంట్ వచ్చేలా చక్రం తిప్పారని యూనిట్ సన్నిహిత వర్గాల కథనం.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి 'నా సామి రంగ'
'నా సామి రంగ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ తీసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ వేరొకరికి ఇచ్చారట. మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు సుమారు 32 కోట్ల రూపాయలు వచ్చాయని టాక్.
స్టార్ మా, డిస్నీతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. 'బిగ్ బాస్' రియాలిటీ షోను ఆయన హోస్ట్ చేస్తున్నారు. అది మంచి రేటింగ్స్ రాబడుతోంది. అంతకు ముందు మా టీవీని స్టార్ గ్రూప్ తీసుకోవడానికి ముందు ఆ ఛానల్ యజమానుల్లో నాగార్జున కూడా ఒకరనేది తెలిసిన విషయమే. ఆయన రంగంలోకి దిగడంతో 'నా సామి రంగ' ఓటీటీ, టీవీ రైట్స్ డీల్ ఈజీగా ఓకే అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
'నా సామి రంగ' సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇక, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
Also Read: బెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?
'నా సామి రంగ'లో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. కొన్ని రోజుల క్రితం నాగార్జున, ఆషికాపై తీసిన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?
'నా సామి రంగ' చిత్రానికి బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి. నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకత్వం: విజయ్ బిన్నీ.