Samantha: ఇంటర్నేషనల్ సినిమాలో సమంత.. రానా సజెషనా..?
సమంత ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించడానికి కారణం రానా అని తెలుస్తోంది. ఎలాగంటే..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇప్పుడు మరింత జోరు పెంచింది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ స్టార్ గా మారింది. ఇటీవల 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకుంది. ఇక రీసెంట్ గా ఓ ఇంటెర్నేషనల్ సినిమా ఓకే చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ ఇంగ్లీష్ సినిమాను ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేయబోతున్నారు. గురు ఫిలిమ్స్ బ్యానర్ పై సునీత తాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్ లో తీసి ఆ తరువాత ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే సమంతకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఛాన్స్ రావడానికి కారణం నటుడు రానా అని తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారో.. హీరో రానా.. సమంతను అప్రోచ్ అవ్వమని నిర్మాత సునీత తాటికి చెప్పారట.
ఆమె వెంటనే సమంతను కలవడం, దానికి ఆమె అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో సమంత బంధాలు తెగిపోయినప్పటికీ ఒక నటిగా ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని రానా సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అనౌన్స్మెంట్ రాగానే.. రానా స్పెషల్ గా సమంత విష్ కూడా చేశారు. ఇక ఈ సినిమాలో సమంత బై సెక్సువల్ పాత్రలో కనిపించనుందట. అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలతో కూడా శృంగారం జరిపే స్వభావం ఉన్న పాత్ర. మరి ఈ పాత్రలో సమంత ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!
Shine on my friends https://t.co/vaksM3zFBK Sunita and Sam!! This is big stuff congratulations!! https://t.co/GoxXFkPNyZ
— Rana Daggubati (@RanaDaggubati) November 26, 2021
Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..
Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి